Huge Sinkhole: ఎక్స్ ప్రెస్ వేపై భారీ గుంత.. దాని కిందే అండర్ పాస్.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్ వేపై భారీ గుంత ఏర్పడింది. దాదాపు 15 అడుగులు వరకు రోడ్డు కుంగడం, దాని కిందే అండర్ పాస్ నిర్మాణంలో ఉండడంతో అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని వాహనాలను మళ్ళించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అండర్ పాస్ నిర్మాణం కారణంగానే రహదారి కుంగినట్లు తెలుస్తోంది. రహదారిని నిర్మించిన తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Huge Sinkhole
Huge Sinkhole: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్ వేపై భారీ గుంత ఏర్పడింది. దాదాపు 15 అడుగులు వరకు రోడ్డు కుంగడం, దాని కిందే అండర్ పాస్ నిర్మాణంలో ఉండడంతో అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని వాహనాలను మళ్ళించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అండర్ పాస్ నిర్మాణం కారణంగానే రహదారి కుంగినట్లు తెలుస్తోంది. రహదారిని నిర్మించిన తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
నిన్న ఈ రోడ్డు కుంగినప్పటి నుంచి కొన్ని గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ మళ్ళించి చర్యలు తీసుకోవడంతో ఇవాళ ఉదయం నుంచి అక్కడ ట్రాఫిక్ జామ్ ఏమీ లేదని అధికారులు మీడియాకు తెలిపారు. ఆ రహదారి మీదుగా ప్రతిరోజు వేలాది వాహనాలు వెళ్తుంటాయి. అక్కడ వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు.
Noida-Greater Noida expressway pic.twitter.com/vBqgTatHMu
— Piyush Rai (@Benarasiyaa) August 27, 2022