Tunnel: బెడ్ కింద భారీ సొరంగం.. వీడియో వైరల్
దీనిని చూసిన నెటిజన్లు తమకు తోచినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒసామా బిన్ లాడెన్ గతంలో ఇందులోనే ఉన్నదనుకుంటా అని కొందరు అంటే, మరికొందరేమో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు బాగా ఉపయోగపడుతుందని అంటారు.

Tunnel
Tunnel: ఇంట్లో రహస్య గదులు ఉండటం సాధారణమైన విషయమే.. అదే ఇంట్లోంచి బయటకు వెళ్లేందు ఓ పెద్ద సొరంగం ఉంటే, అది వింతగానే ఉంటుంది. అటువంటి వింత సొరంగం ఉన్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయింది. ఎవరికి అనుమానం రాకుండా బెడ్ కింద ఓ సొరంగం తవ్వారు. బెడ్ ని ఓ మూల లేకగానే మెట్లు కనిపిస్తున్నాయి. ఇక కిందకు దిగితే ఓ సొరంగం కనిపిస్తుంది.
ఈ సొరంగం చిన్నదేం కాదు బైక్ వేసుకొని వెళ్లేంత పరిమాణంలో ఉంది. ఇక వెలుతురు కోసం పసుపు రంగులో ఉండే లైట్లను అమర్చారు. రైసింగ్.టెక్ అనే ఇన్ స్టా ఖాతాల్లో దీనిని పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సొరంగం ఎక్కడుంది అనే విషయం తెలియరాలేదు.
దీనిని చూసిన నెటిజన్లు తమకు తోచినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒసామా బిన్ లాడెన్ గతంలో ఇందులోనే ఉన్నదనుకుంటా అని కొందరు అంటే, మరికొందరేమో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు బాగా ఉపయోగపడుతుందని అంటారు.
View this post on Instagram