సాలే..పాక్ మూస్కోని కూర్చో: తుపాకీ మాదే తూటా మాదే

భారత్ సర్జికల్ ఎటాక్ తర్వాత దేశవ్యాప్తంగా IAF పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రముఖులంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చర్యలను అభినందిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 07:02 AM IST
సాలే..పాక్ మూస్కోని కూర్చో: తుపాకీ మాదే తూటా మాదే

Updated On : February 27, 2019 / 7:02 AM IST

భారత్ సర్జికల్ ఎటాక్ తర్వాత దేశవ్యాప్తంగా IAF పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రముఖులంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చర్యలను అభినందిస్తున్నారు.

భారత్ సర్జికల్ ఎటాక్ తర్వాత దేశవ్యాప్తంగా IAF పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రముఖులంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చర్యలను అభినందిస్తున్నారు. ఈ క్రమంలో  బుల్లితెర యాంకర్, హీరోయిన్ రష్మి చేసిన పోస్ట్ నెటిజన్‌లకు విపరీతంగా నచ్చేస్తోంది. సూపర్ రష్మి ఇప్పుడు నచ్చావ్ అంటూ నెటిజన్లు తెగ పొగడేస్తున్నారు.
Also Read: Surgical Strikes 2.0 : హైదరాబాద్ అప్రమత్తం

‘సాలె.. నీ పాకిస్థాన్ గొప్పతనం ఏంట్రా? మాతోనే మీ అస్థిత్వం.. లేకపోతే మీరు మట్టితో సమానం..పాక్‌లోని చాలా ప్రాంతాలను నేటికీ మా నాయకుల పేర్లతో పిలుస్తున్నారు తెలుస్తోందా మీకు.. శాంతికాముకులం కాబట్టే నీ లాంటి బచ్చాగాళ్లను క్షమిస్తూ వస్తున్నాం.. ఇప్పటికైనా మూసుకుని కూర్చో’ అంటూ పుల్వామా ఉగ్రదాడిని సమర్ధించిన వారి తాట తీసిన రష్మి.. తాజాగా 300 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టి దాయాది దేశానికి తగిన గుణపాఠం చెప్పిన వాయు సైన్యం సేవలను, భారత పౌరుషాన్ని రుచి చూపించారు అంటూ.. పొగడ్తలతో ముంచెత్తింది. వారిని  కీర్తిస్తూ వహ్ వా అనిపించే డైలాగ్‌ని పోస్ట్ చేసింది. 
Also Read: రౌడీ ఇన్స్‌పెక్టర్ : నడిరోడ్డుపై వెంటాడి.. వేటాడి కొట్టాడు

అలనాటి పాపులర్ హీరో రాజ్ కుమార్.. విలన్‌ని హెచ్చరిస్తూ చెప్పే ఫేమస్ డైలాగ్‌ని గుర్తు చేసుకుంటూ సందర్భోచితంగా ఉపయోగించింది రష్మి. ‘మేము మిమ్మల్ని తప్పకుండా చంపుతాం.. మిమ్మల్ని చంపే తుపాకీ మాదే.. బుల్లెట్ కూడా మాదే.. చంపే టైం కూడా మాదే.. కాని ఒక్కటే తేడా మిమ్మల్ని చంపే భూమి మాత్రం మీదే అవుతుంది’ అంటూ రోమాలు నిక్కబొడిచే డైలాగ్‌ను సర్జికల్ స్ట్రైక్ సందర్భంగా షేర్ చేసింది రష్మి.

ప్రస్తుతం రష్మి చేసిన ఈ డైలాగ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పర్ఫెక్ట్ టైమింగ్ రష్మి.. పాకిస్థాన్‌కి చుక్కలు చూపిస్తూ ట్వీట్స్‌తో తుక్కు తుక్కు చేస్తున్నావ్.. ఇలాంటి ఆలోచనలు నీకు ఎలా వస్తాయి అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
Also Read: మానవబాంబుల తయారీ కేంద్రంగా బాలకోట్