Dairy Milk Silk Pakoda : ‘డెయిరీ మిల్క్ సిల్క్ పకోడా’ కొత్త వంటకం తయారీ చూసి మండిపడుతున్న నెటిజన్లు

పకోడీలు ఇష్టపడని వారుండరు.. చాక్లెట్ బార్ అంటే మహా ఇష్టం ఉన్నవారు ఉంటారు. చాక్లెట్ బార్‌తో పకోడీ వేస్తే బాబోయ్............. అనకండి. ఇప్పుడు 'డెయిరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ పకోడీ' అట.. దీని తయారీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Dairy Milk Silk Pakoda : ‘డెయిరీ మిల్క్ సిల్క్ పకోడా’ కొత్త వంటకం తయారీ చూసి మండిపడుతున్న నెటిజన్లు

Dairy Milk Silk Pakoda

Updated On : August 23, 2023 / 12:28 PM IST

Dairy Milk Silk Pakoda : పకోడీలు, పచ్చిమిరపకాయ బజ్జీలు సాయంత్రం వేళ సాక్స్‌గా తినడానికి చాలామంది ఇష్టపడతారు. వాతావరణం చల్లగా ఉన్న సమయంలో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇష్టమైన కూరగాయలతో కూడా బజ్జీలుగా వేసుకుంటారు. అయితే ‘డెయిరీ మిల్క్ సిల్క్ పకోడా’ గురించి విన్నారా? ఇదేం కొత్త ప్రయోగం అని డౌట్ వచ్చింది కదా. దీనిపై ఇంటర్నెట్ రియాక్షన్ కూడా చదవండి.

Shot Momos : కాలేజీ అమ్మాయి కొత్త వంటకం “షాట్ మోమోస్”.. ఓ వైపు చదువుకుంటూ.. మరోవైపు కష్టపడుతూ..

డైరీ మిల్క్ సిల్క్ పకోడా ఏంటి? అంటే ఫేమస్ చాక్లెట్ బార్ ఇప్పుడు పకోడీగా మారింది. అదెలా ? అంటే సాధారణంగా ఇష్టమైన వెజిటబుల్స్‌ని సెలక్ట్ చేసుకుని శనగపిండిలో ముంచి వాటిని క్రిస్పీగా గోధుమ రంగు వచ్చేవరకూ నూనెలో వేయిస్తారు. అయితే డైరీ మిల్క్ సిల్క్ పకోడా ఎలా ఉంటే అదే శనగపిండిలో వెజిటబుల్ బదులు డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ బార్‌ను ముంచి వేడి నూనెలో వేయించారు. పకోడా గోధుమ రంగులోకి రాగానే బయటకు తీసి దానిని సగానికి కట్ చేసి సర్వ్ చేస్తారు. foodienovavlogs ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో చూసి ఇంటర్నెట్ వినియోగదారులు విపరీతంగా ద్వేషిస్తున్నారు.

Godzilla Ramen : “గాడ్జిల్లా రామెన్” ఇంటర్నెట్‌ను భయపెడుతున్న వంటకం

పకోడీని ఇష్టపడేవారు .. చాక్లెట్ బార్ ఇష్టపడే వారు ఉంటారు. రెండిటిని కలిపి ఇలా చేయడం దారుణం అని నెటిజన్లు వాపోతున్నారు. ఈ వీడియో చూసిన తరువాత నేను జీవించే ఉంటే దీనిని నేను ఖచ్చితంగా తింటాను అని.. డెయిరీ మిల్క్ మీద నాకున్న ఇష్టాన్ని చంపేశారు.. అని నెటిజన్లు చమత్కారంగా కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by SUMIT SONI (@foodienovavlogs)