చైల్డ్ లాక్ వెయ్యాలి కదా? : ఎంత పెద్ద ప్రమాదం.. తృటిలో తప్పించుకున్నాడు

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 06:13 AM IST
చైల్డ్ లాక్ వెయ్యాలి కదా? : ఎంత పెద్ద ప్రమాదం.. తృటిలో తప్పించుకున్నాడు

Updated On : January 10, 2020 / 6:13 AM IST

కారులో పిల్లలతో కలిసి ప్రయాణించేటప్పుడు, వారి భద్రతా గురించి పట్టించుకోకుండా కొంత మంది నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటారు. పిల్లల భద్రతతో పాటు రహదారి భద్రతా గురించి చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తండ్రి తన కొడుకుతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. కారు డోర్ అన్ లాక్ చేసి ఉండటంతో హైవేలో టర్నింగ్ పాయింట్ వద్ద పిల్లవాడు కారులోనుంచి కింద పడ్డాడు. రద్దీగా ఉండే హైవేపై పిల్లవాడు క్రింద పడిన సమయంలో ఒక వైపు కారు, మరోక వైపు బస్సు వస్తున్నాయి. పిల్లవాడు కింద పడినది గమనించిన వారు సడెన్ బ్రేక్ వేయడంతో పిల్లవాడికి ఏమి కాలేదు. 

పిల్లలతో కలిసి ప్రయాణించేటప్పుడు కారు డోర్ లాక్ చేశారా లేదా అని చెక్ చేసుకోవాలి. వారు సీట్లులో సరిగ్గా కూర్చున్నారో లేదో చెక్ చేసుకొని ప్రయాణించండి. అందరూ ఈ పిల్లవాడి లాగా అదృష్టవంతులు కాలేరు కదా.. అని ఐపిఎస్ అధికారి పంకజ్ నైన్ ట్వీట్ చేశాడు.

 

ఈ వీడియోను చూసిన నెటిజన్లు బస్సు, లారీ డ్రైవర్ అలట్ గా ఉండి, వాహనాలను ఆపి, పిల్లవాడిని కాపాడినందుకు కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు.