వైరల్ వీడియో : డాక్టర్ అయిన భార్య కోసం భర్త ఏం చేశాడో తెలుసా

కరోనా వైరస్ పేరు వినబడితే చాలు ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ కు చికిత్సను అందిస్తున్న డాక్టర్ల గురించి అయితే చెప్పనక్కర్లేదు భయంతో పాటు బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి వారి పైన ఒత్తిడి కాస్తా ఎక్కువగానే ఉంటుంది. నర్సులుగా, డాక్టర్లగా పని చేసే మహిళలకు ఇంక కాస్తా ఎక్కవగా ఒత్తిడి ఉంటుందనే చెప్పవచ్చు.
అలాంటి ఓ మహిళ ఒత్తిడిని తగ్గించటానికి ఆమె భర్త చేసిన పని గురించి తెలుసుకుందాం.. దాదాపు ఒక నిమిషం పాటు ఉన్న వీడియోని రెడిటర్స్ యాప్ లో సోమవారం(మార్చి30,2020) షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి తన ఇంటిని శుభ్రం చేస్తూ కనిపిస్తాడు. కరోనా వైరస్ కారణంగా ఖరీదైన కమ్ ఫై క్యాస్టిల్ కి తీసుకువెళ్లలేని పరిస్ధితి కాబట్టి ఇంటిలోనే చిన్నపాటి గుడారాన్ని ఏర్పాటు చేసి డాక్టరైన తన భార్యని ఆశ్చర్య పరిచాడు. కరోనా వైరస్ కారణంగా డాక్టరైన తన భార్య ఒత్తిడిని తగ్గించటం కోసం ఒక అందమైన గుడారాన్ని ఏర్పాటు చేసి, అందులో ఆడవాళ్లకు ఇష్టమైన కొన్ని వస్తువులను అందంగా అమర్చాడు. దాంతో పాటు రీలాక్స్ కావటానికి బెడ్ కూడా ఏర్పాటు చేశాడు. ఆమెకి ఇష్టమైన వైన్, కుక్క పిల్లలను అందులో ఉంచాడు. తను ఊహించిన విధంగా ఇంటికి వచ్చిన తన భార్య చూసి ఆశ్చర్యపడింది. ఆ జంట వైట్ వైన్ తాగుతూ ప్యూచర్ గోల్స్ గురించి మాట్లాడుకున్నారు.
ఇప్పటివరకు ఈ వీడియోకి 78,300 లైక్ లు వచ్చాయి. 1500 మంది కామెంట్స్ చేశారు. వీడియో చూసిన ఓ నెటిజన్ మిమ్మల్ని చూస్తే‘నా కళ్లు చమ్మగిలాయి, సో స్వీట్’అంటూ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి మీ ఇంటికి నేను రావచ్చా అని కామెంట్ చేశాడు. దానికి ఆ జంట మీరాక కోసం మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి అని రీట్వీట్ చేశారు.
What this husband did for his wife who is a doctor in these hard times. from r/nextfuckinglevel