‘Anti-cheating’ exam hats: ఇలా కూడా పరీక్ష రాస్తారా?.. విద్యార్థుల ఫొటోలు వైరల్
ఫిలిప్పీన్స్ లో విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో చూచిరాతలు రాయకుండా కాలేజీ సిబ్బంది కనబర్చిన తీరు విస్తుగొల్పుతోంది. విద్యార్థులు పక్కకు చూడకుండా, చూసినా పక్కవారి జవాబు పత్రాలు కనపడకుండా వారి ముఖాలకు హెల్మెట్లు, అట్టలు, పేపర్లు, ఎగ్ బాక్సులు పెట్టారు. ఇందుుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. లెగాజ్పి నగరంలోని ఓ కాలేజీ విద్యార్థులకు పరీక్ష నిర్వహించిన సమయంలో ఇలా కళాశాల సిబ్బంది వ్యవహరించారు.

‘Anti-cheating’ exam hats: ఫిలిప్పీన్స్ లో విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో చూచిరాతలు రాయకుండా కాలేజీ సిబ్బంది కనబర్చిన తీరు విస్తుగొల్పుతోంది. విద్యార్థులు పక్కకు చూడకుండా, చూసినా పక్కవారి జవాబు పత్రాలు కనపడకుండా వారి ముఖాలకు హెల్మెట్లు, అట్టలు, పేపర్లు, ఎగ్ బాక్సులు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
లెగాజ్పి నగరంలోని ఓ కాలేజీ విద్యార్థులకు పరీక్ష నిర్వహించిన సమయంలో ఇలా కళాశాల సిబ్బంది వ్యవహరించారు. విద్యార్థులు నిజాయితీగా పరీక్షలు రాసేందుకే తాను ఇలా ఫన్నీగా ఆలోచించి ఈ ఏర్పాట్లు చేశానని ఆ కాలేజీ లెక్చరర్ చెప్పారు. ఈ ఐడియా ఫలించిందని కూడా కొందరు ప్రొఫెసర్లు అన్నారు. కాలేజీ సిబ్బంది ఇటువంటి ప్రయత్నాలు చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ పలు దేశాల్లో ఇటువంటి ప్రయత్నాలే చేసి కాలేజీ సిబ్బంది విమర్శలు ఎదుర్కొన్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..