వీడియో వైరల్: రెస్టారెంట్ కిచెన్‌లో స్నానం చేసిన ఉద్యోగి

ఓ రెస్టారెంట్ ఉద్యోగి కిచెన్ సింక్ లోని స్నానం చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ వీడియోని కానర్ సోమెర్ ఫీల్డ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
అమెరికాలో మిచిగాన్ రెస్టారెంట్ లో పని చేస్తున్న ఓ ఉద్యోగి స్నానం చేయటానికి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. సరాసరి కిచెన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న సింకులో నీళ్ల, సబ్బు నురగను నింపి దాని బాత్ టబ్ లాగా మార్చేశాడు. అందులోకి దిగి స్నానం చేస్తూ ఇది హాట్ టబ్ లాగా ఉంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా అనటంతో అక్కడ ఉన్నవారందరు ఫక్కున నవ్వుతారు. అదే సమయంలో అక్కడే ఉన్న వ్యక్తి సింకులోకి ఓ వస్తువును విసిరి, ముందు నిన్ను నువ్వు రుద్దుకో అనగానే అతను నిజంగానే రుద్దుకోవటం కనిపిస్తుంది.
ఇదంతా వీడియో తీసి మెుదటగా టిక్ టాక్ లో షేర్ చేయటంతో అది వైరల్ గా మారింది. అంతేకాకుండా ఇది చూటానికి చాలా అసహ్యంగా ఉంది. ఇక పై ఎవరు ఆ రెస్టారెంట్ వెళ్లకండి అనే క్యాప్షన్ తో సోమర్ ఫీల్డ్ తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు.
ఇప్పటివరకు ఈ వీడియోని 2లక్ష మంది పైగా వీక్షించారు. ఆ ఉద్యోగి చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది, ఇదేనా నీ కస్టమర్లకు నువ్వు ఇచ్చే గౌరవం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.