“ప్రధాని ఉజ్వల్ యోజన” పేదలకు ఎలా అందుతుందో చూశారా

  • Published By: venkaiahnaidu ,Published On : April 9, 2019 / 02:37 PM IST
“ప్రధాని ఉజ్వల్ యోజన” పేదలకు ఎలా అందుతుందో చూశారా

Updated On : April 9, 2019 / 2:37 PM IST

ఉత్తరప్రదేశ్ లోని మథుర లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బాలీవుడ్ నటి హేమమాలిని పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.తన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫొటోలను ఆమె ఎప్పటకప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.అయితే ఇటీవల ఆమె షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.హేమమాలిని షేర్ చేసిన ఫొటోలో ఓ వృద్దురాలు తలపై కట్టెల మోపును మోస్తోంది. దారిలో వెళుతున్న ఆమెను ఆపి మరీ హేమమాలిని ఆమెతో ఫొటో దిగారు.

అయితే ఈ ఫొటోపై నెటిజన్లు ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు.ప్రతీ ఇంటికీ వంటగ్యాస్ సదుపాయం అంటూ బీజేపీ ప్రవేశపెట్టిన ప్రధాని ఉజ్వల్ యోజన పథకం ఎంతబాగా పేదలకు అందుతుందో చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అనంతరం ‘ఉజ్వల్ యోజన’ బండారం బయటపెట్టిన హేమమాలిని అంటూ కామెంట్లు చేస్తున్నారు.బీజేపీ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయో కళ్లకు కట్టినట్లు చూపించినందుకు ధన్యవాదాలు మేడం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.