TikTok టాప్ 10 వైరల్ వీడియోలివే..

మిలియన్ల కొద్దీ అభిమానులను సొంతం చేసుకున్న టిక్‌టాక్ క్రేజ్ తగ్గకుండా దూసుకుపోతుంది. వినియోగదారులలో ఉన్న కళను బయటపెట్టడంతో పాటు ఫన్నీ వీడియోలతో అందరి మనసులు దోచుకుంటుంది. బైట్ డాన్స్ కంపెనీకి చెందిన టిక్ టాక్ 2019లో పలు వివాదాల్లో ఇరుక్కొని ఎట్టకేలకు బయటపెడింది. ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో మునుపటి కంటే ఎక్కువ అభిమానులను సొంతం చేసుకుంది. మన లొకాలిటీలో పాపులర్ అయిన వీడియోలను మాత్రమే చూస్తాం. ఇండియాలో పాపులారిటీ దక్కించుకున్న వీడియోల గురించి తెలుసుకుందాం.
కాళిగా మారిన బాలిక:
ఓ కుర్రాడు వెంటపడుతుంటే బాలిక తంటాలు పడుతుంది. వేరొక వ్యక్తి దగ్గరకు వెళ్లి కాపాడమని మొరపెట్టుకుంటుంది. ఎవరో కాపాడటం కాదు ఆ రాయిని ఆయుధంగా తీసుకోమని చెప్పడంతో కాళిగా మారిన బాలిక శూరత్వం చూపిస్తుండగా వీడియో అయిపోయింది. ఈ వీడియోకు 2లక్షల లైక్ లు వచ్చాయి.
రాశిఖన్నా టిక్‌టాక్:
రాశిఖన్నా టిక్‌టాక్ వీడియో 2 లక్షల లైక్ లు దక్కించుకుంది. రాశితో పాటు నిల్చొన్న అమ్మాయి చూడకుండా ఓ మూగబ్బాయి లెటర్‌తో పాటు చాక్లెట్ ఇస్తాడు. దానిని చూసి రాశి కోపమొచ్చింది. అప్పుడు అతను నాకు మాటలు రావు. పేపర్ ఓపెన్ చేసి చూడండి అంటే సినిమా టీంకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నట్లు అందులో ఉంది.
సాయిధరమ్-రాశిల ఓ బావా:
‘ఓ బావా.. మా అక్కని సక్కగా చూస్తావా.. ఓ బావా మా అక్కని పెళ్లాడేస్తావా’ ఈ పాటకు సాయిధరమ్ తేజ్, రాశిఖన్నాలతో పాటు ఇంకో అమ్మాయి చేసిన వీడియో పిచ్చ పాపులారటీ సంపాదించుకుంది. 2లక్షల 10వేల లైక్ లు దక్కించుకుంది.
పిచ్చి పీక్స్ పెళ్లికూతురు కూడానా..:
ట్రెండ్ మారుతుంది. ఎవరైనా సిగ్గుపడుతుంటే పెళ్లికూతురిలా సిగ్గేంట్రా అనే రోజులు పోయాయి. పెళ్లి కూతురు అదే డ్రెస్‌లో స్టేజిమీద మాస్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేసేసింది. దీనిని వెయ్యి మందికి పైగా లైక్ చేశారు.
ఎలుగుబంటి డ్రెస్‌లో:
ఓ మనిషి టెడ్డీ బేర్‌లా కనిపించేలా కాస్ట్యూమ్స్ ధరించి మెట్లపై నుంచి జారిపడిన వీడియో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అదేముందిలే అని తీసేయడానికి లేదు. అసలు ట్విస్ట్ వీడియో చివరిలో ఉందని సర్‌ప్రైజ్ అంటూ యూజర్ పోస్టు చేశాడు.
షూలో షేవింగ్ క్రీమ్:
ఈ వీడియోలో ఏం స్పెషల్ ఉందో తెలియకపోయినా పిచ్చ వైరల్ అయింది. అర్థం కాకుండానే ఎక్కువమంది షేర్ చేశారు.
హమ్మింగ్‌బర్డ్ స్పెషల్:
హమ్మింగ్‌బర్డ్ గాలిలో ఎగురుతూ ఉన్న స్వీట్ వీడియో 15 లక్షల లైక్‌లు దక్కించుకుంది.
ఆల్కహాల్ తీసుకుంటున్న మహిళ:
బ్రాస్కీ అనే మహిళ కొంబుచా అనే ఆల్కహాల్ తీసుకుంటున్న వీడియో వైరల్ అయింది. తొలిసారి ఆల్కహాల్ తీసుకుంటూ తన అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెప్పింది.
చప్పట్లతో పిల్లి డ్యాన్స్:
పిల్లి కన్ఫ్యూజ్ అయిందా.. మనల్ని చేసిందా.. అనే స్టైల్ లో ఉందీ వీడియో. దీన్ని 22లక్షల మంది చూశారట.