good thieves : దొంగిలించిన నగదు తిరిగిచ్చేసి పోలీసులకు షాక్ ఇచ్చిన దొంగలు.. వింత సంఘటన వైరల్

దొంగల్లో మంచి దొంగలు ఉంటారండోయ్.. నిజమే. దొంగిలించిన మొత్తం సొమ్ము తిరిగి ఇచ్చేంత మంచి మనసున్న దొంగలు ఉన్నారు. బీహార్ లో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే మీరు నిజమే అంటారు.

good thieves : దొంగిలించిన నగదు తిరిగిచ్చేసి పోలీసులకు షాక్ ఇచ్చిన దొంగలు.. వింత సంఘటన వైరల్

good thieves

Updated On : April 8, 2023 / 3:00 PM IST

good thieves :  సెల్ ఫోన్.. డబ్బు..బంగారం ఒకవేళ దొంగల (thieves) కంటపడితే తిరిగి దొరుకుతాయా? ఇంక వాటికి నీళ్లు వదిలేయడం బెటర్. కానీ ఓ ఊర్లో దొంగలు తాము దొంగతనం చేసిన మొత్తానికి ఎవరి దగ్గర దోచుకున్నారో వారికి తిరిగి ఇచ్చేసారు.. మంచి దొంగలు అయి ఉంటారు అనుకుంటున్నారు కదా.. ఆ కథా కమామీషు చదవండి.

Upasana : దుబాయ్‌లో ఉపాసనకి సీమంతం.. వైరల్ అవుతున్న వీడియో!

ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) ఓ వింత సంఘటన జరిగింది. దొంగతనం జరిగిన సొమ్ము మొత్తం తిరిగి ఇచ్చేసారు దొంగలు. బిలాస్‌పూర్ జిల్లా (Bilaspur district) బిల్హాలో(Bilha) శోభరామ్ కోశాలే (Koshale) అనే వ్యక్తి రోహిత్ యాదవ్ (Rohit Yadav) అనే అతనికి కొంచెం భూమిని అమ్మాడు. కోశాలేకు రోహిత్ యాదవ్ కొంత సొమ్ము చెక్కు ద్వారాను 95,000 రూపాయలు నగదు రూపంలో చెల్లించాడు. అలా వచ్చిన డబ్బును కోశాలే తన ఇంటి నేలమాళిగలో దాచిపెట్టాడు. అది కాస్తా కనిపించకుండా పోయింది. కోశాలే బిల్హా పోలీసులకు ఈ విషయాన్ని ఫిర్యాదు చేశాడు. వారు విచారణ చేపట్టిన కొద్ది గంటల్లో విచిత్రం జరిగింది. కోశాలే ఇంటి ముందు డబ్బు మొత్తం దొరికేసింది. అంతే ఆశ్యర్యపోవడం కోశాలే, పోలీసుల వంతైంది.

Mango-Poori Combination : పాతదే కొత్తగా.. మ్యాంగో జ్యూస్-పూరీ.. వైరల్ అవుతున్న ఫుడ్ కాంబినేషన్

పోయిన సొమ్ము దొరికినందుకు సంతోషం అనిపించినా తిరిగి వాళ్లు ఎందుకు వదిలి వెళ్లారో ఎవరికీ అర్ధం కాలేదు. పోలీసులకు భయపడి తిరిగి ఇవ్వాలనుకున్నా ఈ సంఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసుల మాత్రం దొంగల్ని విడిచిపెట్టేది లేదని వారి కోసం వెతుకులాట కంటిన్యూ చేస్తున్నారు. మొత్తానికి దొంగలు దొరికితే కానీ వారు సొమ్ము ఎందుకు తిరిగి ఇచ్చేసారన్న నిజం తేలదు.