షాపింగ్ మాల్ లో ఫ్రీగా ఫుడ్ తినడం ఎలా.. వీడియో వైరల్

  • Published By: veegamteam ,Published On : February 14, 2020 / 04:06 AM IST
షాపింగ్ మాల్ లో ఫ్రీగా ఫుడ్ తినడం ఎలా.. వీడియో వైరల్

Updated On : February 14, 2020 / 4:06 AM IST

మీరు షాపింగ్ కి వెళ్లి మీకు చాలా ఇష్టమైన ఫుడ్ కొనుక్కుని హ్యాపీగా తింటుంటే.. సడన్ గా ఎవరైనా వచ్చి దాన్ని లాక్కుని తింటే మీకు ఎలా అనిపిస్తుంది… వాల్లని పిచ్చిపిచ్చిగా కొట్టాలనిపిస్తుంది కదు. అలాంటి సిచ్చువేషన్ ని కాలిఫోర్నియాలోని ఒక మాల్‌ లో ఎస్కలేటర్ పైన వెళ్తున్న చాలా మంది ఫేస్ చేసారు. 

కాలిఫోర్నియాలోని గ్లెన్‌డేల్ గల్లెరియా షాపింగ్ మాల్‌ లో ఓ మహిళ ఎస్కలేటర్ పై కిందకి వచ్చేవారికి ఎదురుగా పైకి వెళ్తూ.. వారి చేతిలోని స్నాక్స్ ని (ఫ్రెంచ్ ఫ్రైస్‌, బర్గర్) తీనేస్తూ… మాల్ లో ఫ్రీగా స్నాక్స్ తినడం ఎలా అంటూ టిక్ టాక్ వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఆమె పోస్ట్ చేసిన వీడియోని చూసి.. ట్విట్టర్ యూజర్లు ‘లవ్ ఇట్’ అని రిప్లే ఇచ్చారు, మరొకరు ‘మీరు అదృష్టవంతులు ఎవరూ మిమ్మల్ని ముఖం మీద కొట్టలేదు’ అని స్పందించారు. ఏదైతేనే సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతుంది.