Heavy Rain Fall : అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిమీ & 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్. స్టెల్లా తెలిపారు.

Heavy Rains In Andhra Pradesh
Heavy Rain Fall In Andhra Pradesh : వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిమీ & 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్. స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే 48 గంటలలో వాయువ్య బంగాళాఖాతం & పరిసరాల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా జిల్లాలు, యానాం రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తీరప్రాంత జిల్లాలలో గంటకు 20 నుండి 30 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.
23న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్ప పీడనం వల్ల ఏపీలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అల్పపీడనం కారణంగా కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కోస్తా ఆంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని… మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్లొద్దని సూచించారు.