Telangana Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.

Telangana Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..

Updated On : July 6, 2025 / 6:55 PM IST

Telangana Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వానలు పడతాయని చెప్పింది. 15 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ సహా పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.

ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉంది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలకు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ లోనూ పలు చోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జలపాతాలు.. ఈ వర్షాకాలంలో వెళ్తే ఉంటుంది సామిరంగా..

6వ తేదీ.. ఈ జిల్లాలకు వర్ష సూచన..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం.

7వ తేదీ.. ఈ జిల్లాలకు వర్ష సూచన..
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం.

8వ తేదీ.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..
రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం.