Protests outside Hindu temple: ఇంగ్లండ్‌లోని హిందూ ఆలయం వద్ద తీవ్ర కలకలం.. వీడియోలు వైరల్

ఇంగ్లండ్‌లోని స్మెత్విక్‌ నగరంలో ఓ హిందూ ఆలయం వద్ద తీవ్ర కలకలం చెలరేగింది. దాదాపు 200 మంది దుర్గా భవన్ హిందూ కేంద్రం వద్ద ఆందోళనకారులు ఆ గుడి చుట్టూ చేరి, అక్కడి గోడలు, గేట్లు ఎక్కుతూ, అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ‘అప్నా మస్లిమ్స్’ శాంతియుతంగా ఆందోళన నిర్వహించడానికి దుర్గా భవన్ మందిరం వద్ద నిన్న పిలుపు ఇచ్చినట్లు ఇంగ్లండ్ లోని ఓ వార్తా పత్రిక పేర్కొంది.

Protests outside Hindu temple: ఇంగ్లండ్‌లోని హిందూ ఆలయం వద్ద తీవ్ర కలకలం.. వీడియోలు వైరల్

Protests outside Hindu temple

Protests outside Hindu temple: ఇంగ్లండ్‌లోని స్మెత్విక్‌ నగరంలో ఓ హిందూ ఆలయం వద్ద తీవ్ర కలకలం చెలరేగింది. దాదాపు 200 మంది దుర్గా భవన్ హిందూ కేంద్రం వద్ద ఆందోళనకారులు ఆ గుడి చుట్టూ చేరి, అక్కడి గోడలు, గేట్లు ఎక్కుతూ, అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ‘అప్నా మస్లిమ్స్’ శాంతియుతంగా ఆందోళన నిర్వహించడానికి దుర్గా భవన్ మందిరం వద్ద నిన్న పిలుపు ఇచ్చినట్లు ఇంగ్లండ్ లోని ఓ వార్తా పత్రిక పేర్కొంది.

ఆసియా కప్ లో భాగంగా ఆగస్టు 28న జరిగిన భారత్-పాకిస్థాన్ టీ20 మ్యాచే ఈ ఆందోళనకు కారణం. అసత్య ప్రచారం, విద్వేష వ్యాఖ్యల ఫలితంగా ఆదివారం తూర్పు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. దీంతో మందిరం వద్ద ఆందోళనలకు ‘అప్నా మస్లిమ్స్’ పిలుపునిచ్చింది. నిన్న గుడి వద్దకు దూసుకువచ్చిన ఆందోళనకారులు పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడే ప్రయత్నాలు చేసినట్లు వీడియోల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు మొత్తం 47 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

హిందూ దేవాలయంపై దాడి జరిగిన ఘటనపై ఇంగ్లండ్ లోని భారత హైకమిషన్ స్పందించింది. హింసను ఖండిస్తున్నట్లు పేర్కొంది. రక్షణ కల్పించాలని అక్కడి అధికారులకు విజ్ఞప్తి చేసింది. శాంతిని కోరుతున్న పలు హిందూ, ముస్లిం సంఘాల నాయకులు నిన్న సంయుక్తంగా ఓ ప్రకటన చేశారు. రెచ్చగొట్టే, అసత్య ప్రచారం చేయవద్దని, హింసను విడనాడాలని అన్నారు.

Raju Srivastav: బాలీవుడ్ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఇక లేరు..