Chandrayaan 3 Updates: చంద్రయాన్-3 సక్సెస్.. భారత కీర్తి మరోసారి జగద్వితం..

 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడిపై ప్రయోగాల్లో ఇక మనదే ఆధిపత్యం.

Chandrayaan 3 Updates: చంద్రయాన్-3 సక్సెస్.. భారత కీర్తి మరోసారి జగద్వితం..

Chandrayaan 3

Updated On : August 25, 2023 / 2:29 PM IST

Chandrayaan 3 Updates – landing : చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది. ప్రయోగం విజయవంతమైంది. సాఫ్ట్ ల్యాండింగ్ పై భారీ అంచనాల మధ్య ఈ ప్రయోగం జరిగింది. చంద్రుడిపై ప్రయోగాల్లో ఇక మనదే ఆధిపత్యం.

నా జీవితం ధన్యమైంది: మోదీ
చంద్రయాన్ విజయం నవభారత జయధ్వానం అని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్షణాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశానని తన జీవితం ధన్యమైందని చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి ఆయన మాట్లాడారు.

మోదీ ఆసక్తికరంగా..

ల్యాండింగ్ ప్రక్రియను దక్షిణాఫ్రికా నుంచి ప్రధాని మోదీ ఆసక్తికరంగా చూస్తున్నారు. దేశ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

ల్యాండింగ్ ప్రక్రియ.. టెన్షన్

ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో శాస్త్రవేత్తలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 17 నిమిషాల పాటు ల్యాండింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

బడి పిల్లల ఇస్రో

టెన్షన్ షురూ..

IN ISRO

నంధ్యాలలోనూ పూజలు..

నంధ్యాల మహానంది క్షేత్రంలో ప్రత్యేకంగా చంద్రయాన్ – 3 కోసం పూజలు

చంద్రయాన్ – 3 విజయవంతం కావాలని కోరుకున్న ఆలయ అధికారులు

ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సాధించాలని నందీశ్వరునికి ప్రత్యేక పూజలు

టెంకాయలో పువ్వు..

శ్రీకాకుళo జిల్లాలో చంద్రయాన్ 3 విజయవంతం కావాలంటూ సూర్యుడికి పూజలు

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో పూజలు చేసిన వీహెచ్‌పీ, బజరంగ్ దళ్

ఆలయంలో కొట్టిన టెంకాయలో ప్రత్యక్షమైన పువ్వు…

ఆనందోత్సాహలలో వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ ప్రతినిధులు

కాసేపట్లో..
తిరుపతి జిల్లా శ్రీహరికోట(Sriharikota)లోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (Satish Dhawan Space Centre) నుంచి 40 రోజుల క్రితం (జులై 14న) ప్రయోగించిన చంద్రయాన్‌-3 ల్యాండింగ్ ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది.

విజయవంతంగా ల్యాండ్ అయితే?

రోవర్ ప్రజ్ఞాన్, ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగాక మొదట ల్యాండర్ లోని ఒకవైపు ప్యానెల్ తెరుచుకుంటుంది. ఆ తర్వాత ఆరు చక్రాలు ఉండే రోవర్‌ బయటకు రావడానికి వీలుగా ర్యాంప్ ఏర్పడుతుంది. నాలుగు గంటల తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తుంది. ప్రజ్ఞాన్ చక్రాలపై ఇస్రో లోగోలను ముద్రించారు. భారత జాతీయ చిహ్నం కూడా ఉంటుంది.

Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతమైతే దేశంలో ఏయే మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా?