Viral Video: అర్ధరాత్రి మద్యం తాగి ఎద్దుపైకి ఎక్కి నడిరోడ్డుపై హీరోలా స్వారీ చేస్తూ.. చివరకు..

Viral Video: "జీవితమే ఒక ఆట.. సాహసమే పూబాట" అంటూ కొండవీటి దొంగ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాటపాడుతూ గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్తారు. అదే రేంజ్‌లో ఓ యువకుడు ఎద్దుపై ఎక్కి స్వారీ చేసుకుంటూ వెళ్లాడు. ఇది సినిమా కాదు కాబట్టి ప్రజలు అతడిని చూసి బెంబేలెత్తిపోయారు.

Viral Video: అర్ధరాత్రి మద్యం తాగి ఎద్దుపైకి ఎక్కి నడిరోడ్డుపై హీరోలా స్వారీ చేస్తూ.. చివరకు..

Viral Video

Viral Video: మద్యం తాగి ఎద్దుపై ఎక్కి స్వారీ చేశాడో యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్, రిషికేశ్ (Rishikesh) లోని తపోవన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియో తీసుకుని రాత్రికి రాత్రే స్టార్ అయిపోదామని ఆ యువకుడు ఈ పనిచేసినట్లు తెలుస్తోంది.

అదే అతడి కొంపముంచింది. ఇప్పుడు అతడు పోలీసు కేసును ఎదుర్కొంటున్నాడు. అతడిపై చర్యలు తీసుకుంటున్నామని, మరోసారి జంతువులతో ఇటువంటి పనులు చేయొద్దని హెచ్చరించామని చెప్పారు. ఆ యువకుడు ఎద్దుపై స్వారీ చేసిన వీడియోను ఉత్తరాఖండ్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు.

సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను చూసి అతడిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జంతువులపై అనుచితంగా ప్రవర్తించాడని చెప్పారు. అర్ధరాత్రి వేళ వీధుల్లో అతడి ఎద్దుతో విన్యాసాలు చేస్తుంటే స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఎద్దుపై అతడు దూసుకువస్తుంటే పక్కకు పరుగులు తీశారు. వీడియో తీసుకుని హీరో అవుదామనుకున్న ఆ యువకుడు ఇప్పుడు పోలీసు కేసును ఎదుర్కొంటున్నాడు.

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల్లో డబ్బే డబ్బు.. జస్ట్ అధికారులు పట్టుకున్నదే రూ.378 కోట్లు