పోలింగ్‌కు ముందు సానుభూతి కోసం చంద్రబాబు కుట్రలు

ఏపీలో ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పని చేస్తోందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు చర్చకు దారితీశాయి.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 07:57 AM IST
పోలింగ్‌కు ముందు సానుభూతి కోసం చంద్రబాబు కుట్రలు

ఏపీలో ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పని చేస్తోందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు చర్చకు దారితీశాయి.

ఏపీలో ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పని చేస్తోందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు చర్చకు దారితీశాయి. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు బుధవారం (ఏప్రిల్ 10) అమరావతిలోని ఈసీ కార్యాలయానికి వచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదితో ఆయన భేటీ కానున్నారు. దీంతో ఈసీ కార్యాలయం దగ్గర భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ఏపీ సీఈవో ద్వివేదికి ఫిర్యాదు చేసిన తర్వాత చంద్రబాబు ధర్నాకు దిగనున్నారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Read Also : కొండా విశ్వేశ్వరరెడ్డిపై ఈసీ చర్యలు ఉంటాయా

దీనిపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. పోలింగ్‌ కు కొన్ని గంటల ముందు చంద్రబాబు కొత్త డ్రామాకు తెర తీశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు బాబు కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. పోలింగ్ కు ముందు సానుభూతి కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ ను, కేంద్ర సంస్థలను బ్లాక్ మెయిల్ చేసి తన కుల మీడియా ద్వారా ఏదో జరిగిపోతోందని భావోద్వేగాలు రెచ్చగొడతారని, డబ్బు పంపిణీ అడ్డుకోకుండా చంద్రబాబు చేసుకుంటారని విజయసాయి రెడ్డి అన్నారు. పుట్టుకతోనే నయవంచన, కపటం, ద్రోహం వంటపట్టించుకున్న చంద్రబాబు దేనికైనా సిద్ధపడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : తెలుసుకోండి : పోలింగ్ బూత్ లోకి వీటికి అనుమతి లేదు