ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభం : సంతోషంగా ఉందన్న సీఎం

  • Published By: madhu ,Published On : April 20, 2019 / 01:18 PM IST
ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభం : సంతోషంగా ఉందన్న సీఎం

నిరంతరం తాను రాజకీయాల్లో ఉన్నా..కుటుంబంలో ఉన్న వ్యక్తులకు ఆర్థిక స్థిరత్వం రావాలని తాను కోరుకున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అందులో భాగంగా 1992లో హెరిటేజ్ సంస్థను నెలకొల్పి ఆ బాధ్యతలను సతీమణి భువనేశ్వరీకి అప్పగించినట్లు తెలిపారు. అనంతరం హెరిటేజ్‌ను తాను పట్టించుకోలేదని..భువనేశ్వరీ హెరిటేజ్ సంస్థను ఒక స్థాయికి తీసుకెళ్లిందని బాబు ప్రశంసించారు.
Also Read : దేవుడు దిగిరావాలి : చంద్రబాబు సీఎం అవకుండా ఆపలేరు

ఏప్రిల్ 20వ తేదీన చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్టు రక్తనిధి కేంద్రాన్ని బాబు దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ…1997 ఎన్టీఆర్ మెమోరీయల్ ట్రస్టు స్థాపించినట్లు..ఒక్క పైస ఆశించకుండా..నో లాస్..నో ప్రాఫిట్ కింద చేయడం జరుగుతోందన్నారు. 

నాలుగో బ్లడ్ స్థాపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ అన్నదానానికి శ్రీకారం చుడితే..తాను ప్రాణదానం కింద కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా రూ. 300 కోట్లు వచ్చే పరిస్థితి ఉందని..భవిష్యత్‌లో వచ్చే డబ్బులతో రాయలసీ ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. చాలా బ్లడ్ బ్యాంకులున్నా..ఇంత సిస్టంగా నడుస్తోంది కేవలం ఎన్టీఆర్ ట్రస్టు మాత్రమేనన్నారు బాబు. 
Also Read : పీజీ చేయకుండా రాహుల్ ఎంఫిల్ ఎలా చేస్తారు : జీవీఎల్ క్వశ్చన్స్