ఏటా రూ.20వేలు : విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

ఏపీ సీఎం జగన్ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించారు. చదువుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇందుకోసం ఏటా

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 08:13 AM IST
ఏటా రూ.20వేలు : విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

ఏపీ సీఎం జగన్ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించారు. చదువుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇందుకోసం ఏటా

ఏపీ సీఎం జగన్ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించారు. చదువుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇందుకోసం ఏటా రూ.20వేలు ఇస్తామని సీఎం జగన్ చెప్పారు. హాస్టల్ లో ఉండి చదువుకునేందుకు వీలుగా మెస్ ఛార్జీలు సహా ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20వేలు ఇస్తామని ప్రకటించారు. ఒంగోలులో మనబడి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్.. అమ్మఒడి పథకం, ఫీజు రీయింబర్స్ మెంట్ గురించి మాట్లాడారు.

జనవరి 9న అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తామన్నారు. ఇక ఇంటర్ తర్వాత చాలామంది పేద విద్యార్థులు డిగ్రీ చదవడం లేదని, అలాంటి వారికోసం పూర్తిగా ఫీజురీయింబర్స్ మెంట్ పథకం అమలు చేస్తామన్నారు. అలాగే హాస్టల్, మెస్ ఛార్జీల కింద ఏటా రూ.20వేలు విద్యార్థులకు అందించనున్నట్లు చెప్పారు. చదువు ఏ పేద విద్యార్థి తల్లిదండ్రులకు భారం కాకూడదన్నది తమ ప్రభుత్వం లక్ష్యం అని సీఎం చెప్పారు. పిల్లలను బడికి పంపితే చాలని, పేదల బతుకులు మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సీఎం అన్నారు.

ప్రభుత్వ స్కూల్స్ లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే కొన్ని సమస్యలు వస్తాయన్న విషయం తెలుసన్న సీఎం జగన్… వాటిని అధిగమించేందుకు బ్రిడ్జ్‌ కోర్సులు ఏర్పాటు చేస్తామన్నారు. టీచర్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఒకటి రెండేళ్లు కష్టపడ్డా.. ఆ తర్వాత పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో ముందుకెళ్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రతీ ఏటా స్కూళ్ల కోసం రూ.3500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని 45 వేల స్కూళ్ల రూపురేఖలను మారుస్తామన్నారు. తొలి విడతలో భాగంగా 15,700 స్కూల్స్ లో నాడు-నేడు ప్రారంభిస్తామని… జూన్‌, 2020 నాటికి సర్కారీ బడుల్లో అన్ని వసతులు తీసుకొస్తామని సీఎం చెప్పారు.