రాష్ట్రాన్ని మూడు ముక్కలాట చేశారు : మూడు రాజధానులంటే..జగన్ చూసి నవ్వుతున్నారు

  • Edited By: veegamteam , January 3, 2020 / 11:57 AM IST
రాష్ట్రాన్ని మూడు ముక్కలాట చేశారు : మూడు రాజధానులంటే..జగన్ చూసి నవ్వుతున్నారు

రాజధాని గురించి ప్రజలు పోరాడుతుంటే సీఎం జగన్ రైతులపై కేసులు పెడుతున్నారనీ ప్రశ్నిస్తున్న మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఏపీ రాష్ట్రాన్ని సీఎం జగన్ భయాందోళనలకు గురయ్యేలా చేశారనీ..మూడు రాజధానులు అంటూ ప్రతిపాదన పెట్టి..దానిపై కమిటీలు వేసి..నానా గందరగోళానికి గురిచేస్తున్నారని..మూడు రాజధానుల అంశంపై మేధావులు సైతం ఆశ్చర్యపోతున్నారనీ రాష్ట్రాన్ని చూసి అందరూ నవ్వుకునే పరిస్ధితికి తీసుకొచ్చారని చంద్రబాబు అన్నారు. 

ఇప్పటికే దాదాపు అమరావతి నిర్మాణానికి దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టామని..మరో రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తే బిల్డింగ్ ల నిర్మాణం పూర్తైపోతుందని తెలిపారు. ఇప్పటికే తాము రైతుల నుంచి సేకరించిన 33వేల ఎకరాల్లో మరో 10వేల ఎకరాల భూమి మిగిలి ఉందని దాన్ని డెవలప్ చేస్తే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయని ఈ విషయాన్ని పక్కన పెట్టేసి దాదాపు పూర్తైపోయిన అమరావతిని కాదని మరోచోటకు రాజధానికి తరలిస్తే మరింతగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని చంద్రబాబు తెలిపారు.  

రాష్ట్రాన్ని మూడు ముక్కలాట చేసి పేకాటను ఆడుతున్నారనీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు చంద్రబాబు. మూడు రాజధానుల ప్రకటతో ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఆగిపోయిందని ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల్ని ఏం చేద్దామని సీఎం జగన్ అనుకుంటున్నారో అర్థం కావటంలేదనీ..ఇది సీఎం జగన్ అవగాహనారాహిత్యానికి నిదర్శమని అన్నారు. రాజధానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను అమరావతిలో కల్పించాం..మరి ఎందుకు అమరావతి రాజధానిగా పనికిరాదో..విశాఖపై సీఎం జగన్  ఎందుకు మొగ్గుచూపుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనీ ఇది ప్రజలకు..రాష్ట్ర యువతకు సంబంధించిన విషయమని సూచించారు.  
 
తమ ప్రభుత్వ హయాంలో విశాఖలో ఆదాని కంపెనీవారు రూ.70వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ నెలకొల్పేలా కృషి చేశామని తెలిపారు. ఆ కంపెనీ వెనక్కి వెళ్లిపోయే దుస్థితికి సీఎం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. విద్యార్ధుల భవిష్యత్తుని తీర్చిదిద్దే కేంద్రంగా రాజధాని ఉండాలని కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం విద్యార్ధుల భవిష్యత్తుని అంధకారం చేసేలా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు.