ఈసీ ముందుకు లక్ష్మీ’స్ ఎన్టీఆర్ నిర్మాత.. ఏం జరుగుతుంది?

  • Published By: vamsi ,Published On : March 25, 2019 / 01:14 AM IST
ఈసీ ముందుకు లక్ష్మీ’స్ ఎన్టీఆర్ నిర్మాత.. ఏం జరుగుతుంది?

విడుదలకు దగ్గరయ్యే కొద్ది లక్ష్మీ’స్ ఎన్‌టీఆర్ సినిమా వివాదం పెరిగిపోతుంది. సినిమా విడుదలపై అభ్యంతరాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో లక్ష్మీ’స్ ఎన్‌టీఆర్ సినిమా నిర్మాత, వైసీపీ లీడర్ రాకేశ్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఇవాళ(25 మార్చి 2019) ఉదయం 11గంటలకు ఎన్నికల సంఘం ముందు హాజరు కావాలంటూ నోటీసులు పంపింది.
Read Also : వర్మకు చేదు అనుభవం

సినిమాకు సంబంధించిన అభ్యంతరాలపై రాకేశ్ రెడ్డిని వివరణ  కోరనున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా మార్చి 29వ తేదీన విడుదల కానుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేసిన పిటిషన్‌లను తెలంగాణ హైకోర్టు ఇటీవలే కొట్టేసింది.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా లక్ష్మీ పార్వతి కోణంలో ఎన్‌టీఆర్ జీవితం ఏమిటి? చంద్రబాబు చేసిన కుట్ర ఏమిటి? అనే కోణంలో తీస్తున్నారు. ఈ క్రమంలో రాకేశ్ రెడ్డి ఎన్నికల సంఘం ముందు హాజరైన తర్వాతే ఈ సినిమా విడుదలకు సంబంధించి స్పష్టత రానుంది. 
Read Also : నయనతారపై సంచలన వ్యాఖ్యలు: ప్రముఖ నటుడిని వెలి వేయాలంటూ డిమాండ్