ప్రజల చేత ప్రమాణం చేయించిన పోలీసులు

  • Published By: vamsi ,Published On : March 24, 2020 / 06:26 AM IST
ప్రజల చేత ప్రమాణం చేయించిన పోలీసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గంటగంటకు ఈ మహమ్మారి ప్రాణాలు హరిస్తుండగా.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ చెయ్యగా.. రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అయినా కూడా కొంతమంది ప్రభుత్వం ఆదేశాలను మాత్రం పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా పెనుగొండలో ఆసక్తికర విషయం కనిపించింది.

ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని బయటకు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా పట్టించుకోకుండా వచ్చిన వారి చేత పోలీసులు ప్రమాణం చేయించారు. లాక్‌ డౌన్‌ విషయంలో పోలీసులు కఠిన వైఖరి అవలంబించినా కొందరు బయటకు వస్తున్నారని ఈ చర్యకు పాల్పడ్డారు పోలీసులు. పోలీసులకు సహకరించకుంటే కరోనాపై దేశం గెలిచేనా? అని ప్రశ్నిస్తూ.. ప్రమాణం చేయించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుంది.  

ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పిలుపునివ్వగా.. ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వాలని.. కలివిడి కన్నా విడివిడిగా ఉంటేనే వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉంటుందని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. రోడ్లపై ఆటోలు, కార్లు, వ్యక్తిగత వాహనాలు కనిపిస్తే సీజ్ చేస్తున్నారు పోలీసులు. 

See Also | తెలంగాణలో లాక్‌డౌన్: జంతువులకు ఫ్రీడం.. వీధుల్లోకి ఎలుగుబంటి