రేపల్లె ప్యాసింజర్‌కి కరెంట్ షాక్ : ప్రయాణికులకు గాయాలు

  • Published By: veegamteam ,Published On : May 4, 2019 / 10:09 AM IST
రేపల్లె ప్యాసింజర్‌కి కరెంట్ షాక్ : ప్రయాణికులకు గాయాలు

గుంటూరు రేపల్లె ప్యాసింజర్ రైలుకి కరెంట్ షాక్ తగిలింది. బోగీలకు కరెంట్ పాస్ అయ్యింది. దీంతో 10మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బోగీలకు కరెంట్ పాస్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో భయపడిపోయిన కొందరు ప్రయాణికులు ప్లాట్ ఫామ్ పైకి దూకేశారు. దీంతో ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వేజెండ్లలో ఈ ఘటన జరిగింది. రైలు గుంటూరు నుంచి తెనాలి మీదుగా ఒంగోలు వెళుతోంది. విద్యుత్ షాక్ ఘటనతో అధికారులు రైలుని రద్దు చేశారు. అసలు కరెంటు ఎలా పాస్ అయ్యింది. ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది దర్యాఫ్తు చేస్తున్నారు.

శనివారం (మే 4,219) ఉదయం 10.30గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ పుష్ ఫుల్ రైలు ప్రతి రోజు గుంటూరు నుంచి రేపల్లె వెళుతుంది. 15 ఏళ్లుగా ఇదే ట్రైన్ తిరుగుతోంది. వేజెండ్ల ప్రాంతంలో డబుల్ ట్రాక్ వేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త రైల్వే లైన్, కొత్త ప్లాట్ ఫామ్ వేశారు. దానికి సంబంధించి విద్యుత్ లైన్లు అమర్చారు. అధికారులు ట్రయల్ రన్ నిర్వహించిన సమయంలో ఈ ఘటన జరిగింది. కొత్తగా వేసిన లైన్ లో ఏదైనా సమస్య వచ్చి విద్యుత్ షాక్ కొట్టి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. వేజెండ్లలో రైలు ఆపినప్పుడు.. ప్రయాణికులు కిందకి దిగుతున్నారు. రైలు నుంచి ప్లాట్ ఫామ్ పైకి దిగే సమయంలో రైలుకి ఉన్న ఐరన్ హోల్డర్స్ ని ప్రయాణికులు పట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా వారికి షాక్ కొట్టింది. వారి వెనకాల ఉన్న వారికి కూడా కరెంట్ షాక్ తగిలింది. దీంతో భయపడిపోయిన ప్రయాణికులు ప్లాట్ ఫామ్ పైకి దూకేశారు.

రైల్లో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. లేకపోతే తొక్కిసలాట జరిగి ఉండేదని, ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు. కొత్తగా ప్లాట్ ఫామ్ నిర్మిస్తున్నారు. అక్కడ రాళ్లు ఉన్నాయి. ఆ రాళ్ల మీద పడటంతో కొంతమందికి తీవ్ర గాయాలు, కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న రైల్వేశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు. కొత్తగా నిర్మించిన లైన్ లో సాంకేతిక సమస్యలపై ఆరా తీస్తున్నారు. విద్యుత్ వైర్లకు కండక్టర్స్ వేస్తారు. పవర్ సప్లయ్ ట్రైన్ కి రాకుండా జాగ్రత్తలు తీసకుంటారు. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అన్నది అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు లోపం ఎక్కడ అనేది దర్యాప్తు చేస్తున్నారు.