సమ్మర్ ఎఫెక్ట్ : బోసిపోతున్న ఇంద్రకీలాద్రి

  • Published By: madhu ,Published On : May 12, 2019 / 11:22 AM IST
సమ్మర్ ఎఫెక్ట్ : బోసిపోతున్న ఇంద్రకీలాద్రి

భానుడి ప్రతాపంతో ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ తగ్గిపోతోంది. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. సాధారణ రోజుల్లో 30 వేల మంది అమ్మవారిని దర్శించుకుంటే ప్రస్తుతం 15 వేల మంది కూడా దర్శించుకోని పరిస్ధితి ఏర్పడింది. భానుడి ప్రతాపానికి మాడులు పగిలిపోతున్నాయి. ఇళ్ళనుంచి బయటకు రాలేని పరిస్ధితి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత పెరుగుతోంది. 

ప్రతి జిల్లాలో 43 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఆ ఎఫెక్ట్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మపై కూడా పడింది. 
దూర ప్రాంతాలనుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇక ఇంద్రకీలాద్రిపై వడ గాల్పుల తీవ్రత, భానుడి భగభగలు తదితర వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి..