పోలీస్ స్టేషన్ ముందు కుక్క విగ్రహం ఆవిష్కరించిన పోలీసులు

పోలీస్ స్టేషన్ ముందు కుక్క విగ్రహం ఆవిష్కరించిన పోలీసులు

police unveils superdog tinki statue : ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏకంగా ఓ కుక్కకు విగ్రహం ప్రతిష్టించారు. పోలీస్ స్టేషన్ ముందే ఓ కుక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. సాక్షాత్తూ పోలీసులే ఇలా చేశారు అంటే ఆ కుక్కకు ఎంత విలువు ఉందే ఊహించుకోవచ్చు. కుక్కలకు పోలీసులకు నేరస్థుల్ని పంటించటంలో చాలా మంచి సంబంధాలుంటాయి. ఎక్కడ ఏ నేరం జరిగినా జాగిలాలు ఉండాల్సిందే. వాసన పసిగట్టి నేరస్థులకు పట్టించటంతో పోలీసు జాగిలాల పాత్ర ఎంతో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. నేరస్థుల్ని పట్టించటంలో పోలీసులకు జాగిలాలు ఎంతో సహాయసహకారాలు అందిస్తుంటాయి. అలా పోలీసులకు ఎంతో సహాయపడిని టింకీ (Tinki) అనే ఓ జాగిలానికి ఉత్తరప్రదేశ్​లోని ముజఫర్​నగర్​ పోలీసులు ఏకంగా విగ్రహమే కట్టేశారు.

కేసులను ఛేదించడంలో పోలీసులకు జాగిలాలు (Dogs) ప్రధాన పాత్ర వహిస్తాయి. వాసనను బట్టి నిందితులను, అనుమాన వస్తువులను జాగిలాలు ఇట్టే పట్టేస్తాయి. నేరాల కేసుల్ని పరిష్కరించటంలో పోలీసు జాగిలాల పాత్ర అసామాన్యం. ఇలా చాలా సందర్భాల్లో ముఖ్యమైన కేసులను పూర్తి చేయడంలో, నిందితులను పోలీసులకు పట్టించడంలో జాగిలాలు ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి.

అందుకే పోలీసులు సైతం జాగిలాలకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. గౌరవమిస్తారు. అలా పోలీసు డిపార్ట్ మెంట్ కు ఎనలేని సేవలు అందించిన జాగిలానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏకంగా విగ్రహం ఏర్పాటు చేశారు. దానికి గుర్తుగా ఏకంగా పోలీస్​ స్టేషన్ ముందే ఆ కుక్క విగ్రహాన్ని ప్రతిష్టించారు.

టింకి అనే జర్మన్ షెపర్డ్(German Shepherd) జాతి శునకానికి ఈ అరుదైన గౌరవం దక్కింది. 49 క్రిమినల్ కేసుల్లో కీలకమైన ఆధారాలు సేకరించిన ఈ జాగిలానికి ఉత్తరప్రదశ్​లోని ముజఫర్​నగర్​ పోలీసులు ఇలా విగ్రహం ఏర్పాటు చేసి తమ గౌరవాభిమానాన్ని చూపించారు. టెంకీ విగ్రహ ఆవిష్కరణకు ముజఫర్​పూర్​ సిటీ ఎస్పీ అర్పిత్​ విజయ్​వర్ఘీయ, రూరల్ ఎస్పీ అతుల్ కుమార్​, సర్కిల్ ఆఫీసర్ కుల్​దీప్ కుమార్ సహా పలుపులు పోలీసు అధికారులు హాజయయ్యారు. సీనియర్ డాగ్ హ్యాండ్లర్​ సునీల్ కుమార్.. టింకీ ప్రతిమను ఆవిష్కరించారు.

జర్మన్​షెఫర్డ్ జాతికి చెందిన టింకీ.. గ్వాలియర్​లోని బీఎస్​ఎఫ్ అకాడమీ పరిధిలోని నేషనల్ డాగ్ సెంటర్ ద్వారా విధుల్లో చేరింది. తొలుత ముజఫర్​పూర్​లోని ఓ కానిస్టేబుల్​ వద్ద స్నిఫర్ డాగ్​గా చేరింది. కేసులను ఛేదించడంతో దిట్టగా మారడంతో టింకీకి ఆరేళ్లలోనే ఆరుసార్లు ప్రమోషన్ సాధించింది. అంతటి ప్రతిభ టెంకీ సొంతం.

అలా మొత్తం 49 కీలక కేసుల్లో కీలకమైన ఆధారాలను పట్టించింది టెంకీ. అలా పోలీసులకు ఎంతగానో సహాయపడే టెంకీ తన ఎనిమిదేళ్ల వయసులో 2020 నవంబర్​ 3న మృతి చెందింది. టెంకీకి పోలీసులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసులే దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు.

తమ స్వంత కుటుంబ సభ్యులు చనిపోయినంతగా బాధపడ్డారు టెంకీ మృతిని తలచుకుని. ఈక్రమంలో టెంకీ గౌరవానికి గుర్తుగా ముజఫర్ పూర్ పోలీసులు ఇలా టెంకీకి విగ్రహాన్ని ప్రతిష్టించి గౌరవాలను ప్రదర్శించారు.