Adorable Video: కోడి పుంజుకు లిఫ్ట్ ఇచ్చిన బుడ్డోడు.. అలరిస్తున్న వీడియో

చిన్న సైకిల్, లారీతో ఇంటి ముందు ఆడుకుంటున్నాడు ఓ పిల్లాడు. సైకిల్ కు బొమ్మ లారీని కట్టి లాక్కెళ్తున్నాడు. ఇంతలో ఆ చిన్నారికి ఓ కోడి పుంజు కనపడింది. దీంతో దానికి తన లారీపై లిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్లాడు. కోడి పుంజును లారీపై పెట్టి ఆ బుడ్డోడు తీసుకువెళ్తుంటే ఆ కోడి హాయిగా దానిపై నిలబడింది. ఆ పిల్లాడితో పాటు ఓ బాతు కూడా ఉంది.

Adorable Video: కోడి పుంజుకు లిఫ్ట్ ఇచ్చిన బుడ్డోడు.. అలరిస్తున్న వీడియో

Adorable Video

Adorable Video: చిన్న సైకిల్, లారీతో ఇంటి ముందు ఆడుకుంటున్నాడు ఓ పిల్లాడు. సైకిల్ కు బొమ్మ లారీని కట్టి లాక్కెళ్తున్నాడు. ఇంతలో ఆ చిన్నారికి ఓ కోడి పుంజు కనపడింది. దీంతో దానికి తన లారీపై లిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్లాడు. కోడి పుంజును లారీపై పెట్టి ఆ బుడ్డోడు తీసుకువెళ్తుంటే ఆ కోడి హాయిగా దానిపై నిలబడింది. ఆ పిల్లాడితో పాటు ఓ బాతు కూడా ఉంది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు కెమెరాలో బంధించి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి తన మూడ్ మారిపోయిందని, మనసుకు ప్రశాంతత కలిగిందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. చిన్నారుల స్వచ్ఛమైన మనసును చూసి ప్రకృతి కూడా పులకించిపోతుందని మరొకరు కామెంట్ చేశారు.

కోడిని పట్టుకుని ఆ బాలుడు తన బొమ్మ లారీపై పెడితే, ఆ కోడి దాని నుంచి దిగిపోకుండా అక్కడే నిల్చుండిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఆ బాలుడు కోడి పుంజుకు లిఫ్ట్ ఇచ్చి తీసుకువెళ్తుండగా అతడి తండ్రి ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Heitor Borges (@bebecampeiro)

Viral Video: రాహుల్‌కి బీజేపీ జెండాలు చూపిన యువకులు.. వారికి రాహుల్ ఫ్లయింగ్‌ కిస్సెస్