Alcoholic Monkey: వైన్ షాపు ముందు బీర్లు తాగుతూ కోతి హల్‭చల్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన షాపు యజమాని

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలీలో జరిగిన ఘటన అయితే.. ఈ సామెతను మించి పోయినట్టే అనిపిస్తుంది. ఒక వైన్ షాపుకు దగ్గరలో ఉన్న చెట్టుపై మకాం వేసిన కోతి, ఆ షాపుకి వచ్చిపోయే వారి నుంచి బీర్లు లాక్కుని తాగుతోంది. ఇంతటితోనే ఆగితే కోతి అనరు కదా.. స్థానికులను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తోంది. దాడులు కూడా చేస్తోందట.

Alcoholic Monkey: వైన్ షాపు ముందు బీర్లు తాగుతూ కోతి హల్‭చల్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన షాపు యజమాని

Alcoholic Monkey: ‘అసలు కోతి, ఆపై కల్లు తాగెను’ అని అంటుంటారు. నిజమే.. కోతి అంటేనే ఆ పనులు చాలా చిత్రంగా, ఇబ్బందిగా ఉంటాయి. మరి అలాంటిది కల్లు తాగితే ఆ మైకంలో దాని ప్రవర్తన ఇంకే విధంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అయితే మనుషులే కాదు, సామెతలు కూడా అప్‭డేట్ చేసుకోవాలి. ఇప్పుడదే సామెత చెప్పాలంటే ‘అసలే కోతి, ఆపై బీరు తాగెను’ అనాలి. ఇలా అనేందుకు కూడా అనేక ఉదాహరణలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలీలో జరిగిన ఘటన అయితే.. ఈ సామెతను మించి పోయినట్టే అనిపిస్తుంది. ఒక వైన్ షాపుకు దగ్గరలో ఉన్న చెట్టుపై మకాం వేసిన కోతి, ఆ షాపుకి వచ్చిపోయే వారి నుంచి బీర్లు లాక్కుని తాగుతోంది. ఇంతటితోనే ఆగితే కోతి అనరు కదా.. స్థానికులను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తోంది. దాడులు కూడా చేస్తోందట. బీర్ బాటిల్ ఇవ్వకపోయినా, దాన్ని అక్కడి నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నించినా తీవ్ర కోపానికి గురై.. దాడులు చేస్తోందని స్థానికులు వాపోతున్నారు.

ఇది ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించడంతో పాటు, స్థానిక వ్యాపారాలకు కూడా నష్టం కలిగిస్తుండడంతో.. ఆ కోతి బెడద తప్పించాలంటూ వైన్ షాపు యజమాని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

Viral Video: భయంకర ఘటన.. మనిషి తల నోట్లో పెట్టుకుని నగర వీధుల్లో కుక్క పరుగులు