హైదరాబాద్
Wednesday, May 23, 2018 - 12:23

రంగారెడ్డి : తెలుగు రాష్ట్రాలను సోషల్ మీడియా పోస్టులు వణికిస్తున్నాయి. హంతక ముఠా సంచారంపై సోషల్ మీడియాలో విచ్చవిడిగా పోస్టులు దర్శనమిస్తున్నాయి. పలు పల్లెలు భయంతో రాత్రుళ్లు నిద్రకు దూరమౌతున్నాయి. సొంతంగా వంతుల వారీగా గ్రామీణులు పహారా కాస్తున్నారు. అపరిచితులపై అనుమానంతో దాడులకు గ్రామస్తులు తెగబడుతున్నారు. భయంతో చట్టాన్ని గ్రామీణులు చేతుల్లోకి తీసుకుంటున్నారు. అమాయకంగా దాడులు.....

Wednesday, May 23, 2018 - 10:48

హైదరాబాద్ : వదంతులు..పుకార్లు ఎవరూ నమ్మవద్దని రాచకొండ కమిషనర్ సూచించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మేసేజ్ లు వస్తున్న సంగతి తెలిసిందే. చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని..చంపేస్తున్నారంటూ వదంతులు వస్తున్నాయి. దీనితో అనుమానం వచ్చిన వ్యక్తులపై దాడులు చేస్తుండడంతో ప్రాణనష్టం సంభవిస్తోంది. దీనిపై టెన్ టివి రాచకొండ కమిషన ర్ తో ముచ్చటించింది.

పిల్లలను కిడ్నాప్...

Wednesday, May 23, 2018 - 08:13

హైదరాబాద్ : రాంనగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ తనయుడు వైష్ణవ్ (21) హఠాన్మరణం చెందాడు. దీనితో రాంనగర్ లో నివాసం ఉంటున్న దత్తన్న నివాసానికి నేతలు చేరుకుంటున్నారు. కుమారుడు మృతి చెందడంతో దత్తాత్రేయ భోరున విలపిస్తున్నారు. ఆయన్ను ఓదారించడం ఎవరి తరం కావడం లేదు. విషయం తెలుసుకున్న పలువురు సంతాపం ప్రకటించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య...

Wednesday, May 23, 2018 - 06:38

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలను దాదాపుగా పరిష్కరించామన్నారు మంత్రి కేటీఆర్‌. శేరిలింగంపల్లి జోన్‌లో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. తాగునీటి రిజర్వాయర్లను ప్రారంభించారు. గ్రేట‌ర్‌ హైదరాబాద్‌ ప‌రిధిలో త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయడంలో మంచి ఫ‌లితాలు సాధించామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. శేరిలింగం ప‌ల్లి ప‌...

Wednesday, May 23, 2018 - 06:35

బెంగళూరు : కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. మంగళవారం బెంగళూరులోని మాజీప్రధాని దేవేగౌడ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌కు సాదర స్వాగతం లభించింది. కుమారస్వామికి పుష్పగుచ్ఛం అందజేసిన తెలంగాణ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కుమారస్వామిని శాలువాతో సత్కరించారు. బుధవారం అత్యవసర సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నందున ఒకరోజు ముందుగానే...

Wednesday, May 23, 2018 - 06:32

హైదరాబాద్ : బీజేపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో విషాదం నెలకొంది. దత్తాత్రేయ కొడుకు వైష్ణవ్‌ గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం రాత్రి 10.45 ప్రాంతంలో భోజనం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ముషిరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండగానే రాత్రి 12.30కి వైష్ణవ్‌ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. వైష్ణవ్‌ వయసు 21...

Tuesday, May 22, 2018 - 21:36

హైదరాబాద్ : జూన్‌ రెండు నాటికి రాష్ట్రమంతటా... రైతుబంధు చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. దీనికి అనుసరించాల్సిన వ్యూహరచనకు.. బుధవారం మంత్రులు, కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

రైతు బంధుపై కేసీఆర్ సమీక్ష
రైతు బంధు కార్యక్రమం అమలు తీరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సమీక్షించారు....

Tuesday, May 22, 2018 - 20:27

హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని హైకోర్టు అడ్వకేట్‌ అరుణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన.. సీబీఐకి లేఖ రాశారు. స్వామివారి బంగారు ఆభరణాలు, ఆస్తుల లెక్కతేల్చాలంటున్న హైకోర్టు అడ్వకేట్‌ అరుణ్‌ డిమాండ్ చేశారు.

Tuesday, May 22, 2018 - 13:26

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కృష్ణా పునరుజ్జీవానికి కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఇండియా వాటర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కృష్ణానది పునర్జీవనం అనే అంశంపై జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కాళేశ్వరం ప్రాజెక్టుతో 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, ఈ ప్రాజెక్టులో 365 రోజుల పాటు...

Tuesday, May 22, 2018 - 09:48

కర్ణాటక ఎన్నికల అనంతరం ఎన్నో అంశాలపై దేశ వ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రాంతీయ పార్టీలదే హావా కొనసాగుతాయనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్..బీజేపీయేతరలకు అనుగుణంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రాగం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జేడీఎస్ తో చర్చలు కూడా జరిపారు. కానీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తో జేడీఎస్ జత కట్టడంతో కేసీఆర్ ఎలాంటి స్పందన వ్యక్తం...

Pages

Don't Miss