Hyderabad : మీది మొత్తం 1000 అయ్యింది.. కుమారీ ఆంటీ డైలాగ్ వాడేసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు

'మీది మొత్తం 1000 అయ్యింది'.. కుమారీ ఆంటీ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే.. తాజాగా ఈ డైలాగ్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు సైతం వాడేసుకున్నారు.

Hyderabad : మీది మొత్తం 1000 అయ్యింది.. కుమారీ ఆంటీ డైలాగ్ వాడేసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు

Hyderabad

Hyderabad : సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు కుమారీ ఆంటీ. ‘మీది మొత్తం 1000 అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా’ అంటూ కుమారీ ఆంటీ చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. తాజాగా ఇదే డైలాగ్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా వాడేసారు. చలాన్లు వేసే క్రమంలో పోలీసులు పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Kumari Aunty : కుమారి ఆంటీది లవ్ మ్యారేజ్ అట.. తన భర్త ఇచ్చిన ప్రేమలేఖను ఏం చేసిందో తెలుసా?

కుమారీ ఫుడ్ కోర్టు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. మాదాపూర్‌లో ఆమె నడిపే ఫుడ్ కోర్టు ఫేమస్ అవ్వడం.. జనాలు అక్కడ బారులుగా చేరడంతో ట్రాఫిక్ పెరగడం.. దీనిపై సీరియస్ అయిన రాయదుర్గం పోలీసులు కుమారీకి చెందిన వాహనం ఆపి కేసు పెట్టడం జరిగిపోయాయి. ఇది కాస్త పెద్ద వివాదంగా మారింది. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కలగజేసుకుని ఆమెను బిజినెస్ చేసుకోమని ఆదేశించడంతో గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉంటే కుమారీ ఆంటీ డైలాగ్ ‘మీ బిల్లు రూ.1000 .. రెండు లివర్లు ఎక్స్ ట్రా’ అనే డైలాగ్‌తో సోషల్ మీడియాలో చాలానే మీమ్స్ వైరల్ అయ్యాయి.

Demand For Spacious Homes : విశాలమైన ఇళ్లకు హైదరాబాద్‌లో పెరుగుతున్న డిమాండ్

తాజాగా ఈ డైలాగ్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా వాడేసారు. హెల్మెట్ లేకుండా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఫోటోను షేర్ చేసిన పోలీసులు ‘మీది మొత్తం 1000 అయ్యింది.. యూజర్ ఛార్జెస్ ఎక్స్ ట్రా’ అని ట్వీట్ చేసారు. ట్రాఫిక్ రూల్స్ పాటించమని, డ్రైవింగ్ చేస్తూ  సెల్ ఫోన్ మాట్లాడవద్దని అవగాహన కల్పించడంలో భాగంగా కుమారీ ఆంటీ డైలాగ్‌ను క్రియేటివ్‌గా వాడేసారు పోలీసు బాసులు. సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ అవుతోంది.