Amit Shah : అవినీతి తప్ప అభివృద్ధి లేదు .. కేజీ టు పీజీ విద్యను గాలికొదిలేశారు : అమిత్ షా

200ల మంది యువత బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని రాష్ట్ర అభివద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు.

Amit Shah : అవినీతి తప్ప అభివృద్ధి లేదు .. కేజీ టు పీజీ విద్యను గాలికొదిలేశారు : అమిత్ షా

Amit shah

amit shah in hyderabad : 1200ల మంది యువత బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని రాష్ట్ర అభివద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొందుకు హైదరాబాద్ చేరుకున్న అమిత్ సా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..రాష్ట్రం ఏర్పాడ్డాక ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పాలనలో ఎవ్వరికి లబ్ది చేకూరలేదని..తెలంగాణ వ్యాప్తంగా యువత, రైతులు నిరాశలో ఉన్నారని అన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీలేదని అవినీతి తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.

లక్ష ఉద్యోగాలు కల్పిస్తానని ఇచ్చిన హామీ ఏమైంది..? అంటూ ప్రశ్నించిన షా కేజీ టు పీజీ విద్య అని హామీ ఇచ్చి దాన్ని గాలికొదిలేశారు అంటూ ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు కల్పించటంలో బీఆర్ఎస్ విఫలమైందని..ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోయిందని విమర్శించారు. నిధులు, నియామకాల కోసం పోరాడిన యువత బలిదానాలకు అర్ధం లేకుండాపోయిందన్నారు. రూ.3,116 ఇస్తామని చెప్పిన నిరుద్యోగ భృతి కూడా అమలు చేయటంలేదంటూ విమర్శించారు.

Also Read : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నలుగురు బీజేపీ అగ్రనేతలు.. ఎవరెవరు ఎక్కడ ప్రచారం చేస్తారంటే..

తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు వేసే ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ భారీ అవినీతికి పాల్పడింది అంటూ ఆరోపించారు. ఏ ఆశలు..ఆకాంక్షలతో ప్రజలు పోరాడారో ఆ ఆశలు నెరవేరలేదన్నారు. రుణమాఫీ చేస్తామని రైతులకు ఇచ్చిన హామీలే ఏం చేశారు ..? అని ప్రశ్నించారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఇలా ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన బీఆర్ఎస్ బుద్ధి చెప్పాలని తెలంగాణను అభివృద్ధి చేయటానికి కట్టుబడి ఉన్న బీజేపీకి ఓటు వేయాలని కోరారు.

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని.. బీజేపీ అధికారంలోకి రాగానే 4శాతం ముస్లిం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తామని ఈ సందర్భంగా షా స్పష్టం చేశారు. కేసీఆర్ ను ఇంటికి పంపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారని..బీజేపీకి అవకాశమిస్తే వరి పంటకు రూ.1000 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు.

Also Read : IT Raids Hyderabad : బడా వ్యాపారులే టార్గెట్ .. పాతబస్తీలో కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు

ఆర్థికంగా మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు.గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరటం ఖాయమని అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తామిన దీనికి సంబంధించి తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మెదట క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

పాస్ట్ పోర్ట్, మియాపూర్ భూములు, ఔటర్ రింగ్ రోడ్, గ్రానైట్, మనీ లాండరింగ్.. కేసీఆర్ సర్కార్ అవినీతి మయం అయ్యాయని ఆరోపించారు బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తున్నారని విమర్శించారు.ఫార్మా సిటీ, విద్యా సిటీ, టెక్స్ టైల్స్ పార్క్.. ఎక్కడ? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ వలనే తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం ఆలస్యమైందన్నారు.కాంగ్రెస్, ఎంఐఎంకు ఓటు వేస్తే.. బీఆర్ఎస్ కు ఓటు వేసినట్లే అని అమిత్ షా అన్నారు.