IT Raids Hyderabad : బడా వ్యాపారులే టార్గెట్ .. పాతబస్తీలో కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు

తెలంగాణలో ఓ పక్క ఎన్నికల ప్రచార హోరు, మరోపక్క ఐటీ సోదాలు..ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. ఎన్నికల బరిలో ఉన్న కొంతమంది నేతల ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి.

IT Raids Hyderabad : బడా వ్యాపారులే టార్గెట్ .. పాతబస్తీలో కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు

IT raids In Hyderabad Old City

IT raids In Hyderabad Old City : తెలంగాణలో ఓ పక్క ఎన్నికల ప్రచార హోరు, మరోపక్క ఐటీ సోదాలు..ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. ఈ ఎన్నికల బరిలో ఉన్న కొంతమంది నేతల ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మరోపక్క పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు నిర్వహించిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాలకు వెళుతున్న రాజకీయ నేతల వాహనాలను కూడా వదలకుండా తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. దీంట్లో భాగంగా భారీగా నగదు, బంగారం, విలువైన వస్తువులు పట్టుబడుతున్నాయి. వాటిని సీజ్ చేసిన పోలీసులు అవి ఎక్కడివి..? ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు.. ఎవరికి చెందినవి..? అనే కోణాల్లో దర్యాప్తులు చేస్తున్నారు..

ఇదిలా ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగతున్న ఐటీ తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ పాతబస్తీలో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్ గా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఓ రాజకీయ పార్టీకి చెందిన భారీ నగదు సమకూర్చుతున్నారనే అనుమానంతో ఈ దాడులు చేపట్టారు. కోహినూర్ గ్రూప్స్,ఎండీ మజీద్ ఖాన్ ఇళ్లల్లోను..కింగ్స్ గ్రూప్ ల పేరుతో ఉన్న ఫంక్షన్ హాల్స్, హోటల్స్ వంటి వ్యాపార సముదాయాల్లో ఈ సోదాలు జరుపుతున్నారు.

Telangana Assembly Elections 2023 : జూబ్లీహిల్స్ లో ఉద్రిక్తత .. మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో ఎలక్షన్ స్వ్కాడ్ సోదాలు.. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

కాగా..తెలంగాణ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ -22లో మాజీ ఐఏఎస్‌ అధికారి ఏకె గోయల్‌ ఇంట్లో ఎలక్షన్స్‌ స్క్వాడ్‌, టాస్క్ఫోర్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకే గోయల్ ఇంట్లో భారీగా నగదు డంప్‌ అవుతోందని కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌కు సమాచారం అందంటంలో ఆ పార్టీకి చెందిన నేతలు ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించారు. దీంతో అధికారులు గోయల్‌ ఇంటిపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు.