Covid-19 : హైదరాబాద్‌లో 14 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్… తెలంగాణలో మెల్లగా విస్తరిస్తున్న మహమ్మారి

కోవిడ్ మరోసారి పంజా విసురుతోంది. శీతాకాలంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుంటం కలవరానికి గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే కేసులు పెరుగుతుంటం ఆందోళనకు గురిచేస్తోంది

Covid-19 : హైదరాబాద్‌లో 14 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్… తెలంగాణలో మెల్లగా విస్తరిస్తున్న మహమ్మారి

Covid-19

Covid-19 In Telangana : కోవిడ్ మరోసారి పంజా విసురుతోంది. శీతాకాలంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుంటం కలవరానికి గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే కేసులు పెరుగుతుంటం ఆందోళనకు గురిచేస్తోంది. చాపకింద నీరులో విస్తరిస్తున్న కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలని కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ మహమ్మారి మరోసారి విస్తరిస్తుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ కేసులకు సంబంధించి పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది..ఈ క్రమంలో తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన నేపథ్యంలో నగరంలో ఓ చిన్నారికి కోవిడ్ బారినపడటం మరింత ఆదోళ కలిగిస్తోంది. హైదరాబాద్ లో 14 నెలల చిన్నారికి కరోనా సోకింది.

నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారికి కరోనా సోకినట్లు నిలోఫర్ వైద్యులు నిర్ధారించారు.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి…ఇంకా 54 మంది శాంపుల్స్ రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి. వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్ జ్వరం, జలుబు, వాసన లేకపోవడం వంటి లక్షణాలతో ఆస్పత్రులకు జనాలు క్యూ కడుతున్నారు. ఇటువంటి లక్షనాలు ఉన్నవారు తమకు వచ్చింది కరోనా కొత్త వేరియంటా? లేదా..మామూలు జ్వరమా ? తేడా తెలియక గందరగోళంలో పడుతున్నారు. JN 1 వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచిస్తున్నారు.

దేశంలో ప్రస్తుతం 2,997 యాక్టివ్ కేసులున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నక్రమంలో కేరళలో 265 కేసులు నమోదయ్యాయి.