OK Chalo : ‘ఓకే చలో’.. హైదరాబాదీలకు మరో సరికొత్త క్యాబ్ సర్వీస్

హైదరాబాద్ వాసులకు 'ఓకే చలో' పేరుతో మరో సరికొత్త క్యాబ్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ సర్వీసులో అటు డ్రైవర్లకు.. ఇటు కస్టమర్లకు ఛార్జీలు అనుకూలంగా ఉంటాయట.

OK Chalo : ‘ఓకే చలో’.. హైదరాబాదీలకు మరో సరికొత్త క్యాబ్ సర్వీస్

OK Chalo

OK Chalo : ఉబెర్, రాపిడో తరహాలో హైదరాబాద్‌లో మరో సరికొత్త క్యాబ్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. అదే ‘ఓకే చలో’.. పోస్టిలియన్ మొబిలిటీ టెక్నాలజీస్ ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడుతో BRSకు కొత్త చిక్కులు

పోస్టిలియన్ మొబిలిటీ టెక్నాలజీస్ ‘ఓకే చలో’ క్యాబ్ సర్వీస్‌ను ప్రారంభించింది. మిగతా అప్లికేషన్లతో పోలిస్తే ఈ సర్వీస్‌లో డ్రైవర్లకు, ప్రయాణికులకు ధరలు అనుకూలంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇతర సర్వీసులలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వచ్చే డబ్బులలో దాదాపు 30 శాతం నిర్వాహకులు తీసుకుంటున్నారు. ‘ఓకే చలో’ అప్లికేషన్‌లో అలా ఉండదని పోస్టిలియన్ మొబిలిటి టెక్నాలజీస్ డైరెక్టర్ ఓరుగంటి ఉదయభాస్కర్ చెప్పారు. వినియోగదారుల భద్రతతో పాటు వాళ్ల ఫోన్ నంబర్ తెలియకుండా గోప్యత పాటిస్తున్నట్లు పేర్కొన్నారు.

Suma – Kumari Aunty : కుమారి ఆంటీగా మారిపోయిన సుమ.. బ్రహ్మాజీకి కర్రీస్ అమ్ముతూ వీడియో..

డ్రైవర్ల నుండి భారీ కమీషన్లకు బదులు మ్యాచ్ మేకింగ్ ఫీజు క్రింద రూ.5 మాత్రమే నిర్వాహకులు వసూలు చేస్తారట. ఇంత తక్కువ ధరతో సేవలందించే అప్లికేషన్ దేశంలో ఎక్కడా లేదని ఓకే చలో యాప్ యాజమాన్యం చెబుతోంది. 10 శాతం డ్రైవర్ సంక్షేమం కోసం నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్పారు. వినియోగదారుల భద్రత కోసం తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ప్రస్తుతం ఈ యాప్ హైదరాబాద్ లో లాంచ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 3,500 మంది డ్రైవర్లు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు, ఐఓఎస్ వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు