Masonry Jobs : తాపీ మేస్త్రీ కావలెను.. ఎక్కడంటే?

తాపీ మేస్త్రీ కావలెను.. అంటూ హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ ఇచ్చిన ప్రకటన వైరల్ అవుతోంది.

Masonry Jobs : తాపీ మేస్త్రీ కావలెను.. ఎక్కడంటే?

Hyderabad US Consulate

Masonry Jobs : హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ రీసెంట్‌గా ‘తాపీ మేస్త్రీ’ కావలెను అంటూ తమ వెబ్ సైట్‌లో ప్రకటించింది. ఈ ప్రకటనలో జీతంతో పాటు ఇతర అలవెన్సులు కలిపి ఏడాదికి రూ.4 లక్షలకు పైనే ఉంది.

Also Read: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వదిలేయండి.. లెహంగాలు అమ్మండి.. ఐఐటీ గ్రాడ్యుయేట్ సలహాకి నెటిజన్లు షాక్

తాపీ మేస్త్రీ అంటే పెద్ద పెద్ద భవనాల దగ్గర రోజంతా పని చేస్తారు. సిమెంట్, ఇసుక మధ్య విపరీతమైన శారీరక శ్రమ ఉంటుంది. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ తాపీ మేస్త్రీలు కావాలంటూ తమ వెబ్ సైట్‌లో యాడ్ ఇచ్చింది. తాపీ మేస్త్రీ పనికి ఏడాదికి రూ.4,47,348 జీతం, అదనపు అలవెన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే చివరి తేదీ ఫిబ్రవరి 25. అనుభవంతో పాటు పనిలో నైపుణ్యం, ఆసక్తి ఉన్నవారు సంప్రదించాల్సిందిగా ఈ ప్రకటనలో కోరారు.

Also Read: 2024లో ఎంత మంది ఉద్యోగాలు ఊడిపోనున్నాయో తెలుసా?

పూర్తి వివరాల కోసం అమెరికన్ కాన్సులేట్ సైట్‌లో కానీ, డైరెక్ట్‌గా ఆఫీసుకు కానీ వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్యే భవన నిర్మాణ కార్మికులకు ఇజ్రాయెల్ సైతం బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నియామకాలను చేపట్టింది. భారత్ నుండి తరలి వెళ్తున్నవారికి 6,100 ఇజ్రాయెలీ న్యూషెకల్ (రూ.1,37,260 ఇండియన్ కరెన్సీలో) జీతం ఇస్తున్నారట.

 US Consulate General

US Consulate General

Masonry Jobs

Masonry Jobs