సివిల్స్ పాస్ అవ్వాలంటే స్మార్ట్ ఫోన్ బదులు నోకియా 5310 తీసుకోమంటున్న ఐపీఎస్

సివిల్స్ పాస్ అవ్వాలంటే స్మార్ట్ ఫోన్ బదులు నోకియా 5310 తీసుకోమంటున్న ఐపీఎస్

ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్ బోత్రా ఒడిశా క్యాడర్ ఆఫీసర్ చేసిన ట్వీట్ వైరల్ అయిపోయింది. సీరియస్ క్వశ్చన్‌ను సిల్లీగా అడిగిన నెజిజన్‌కు అదే రేంజ్ లో కౌంటర్ఇచ్చారు. యూపీఎస్సీ సర్వీసెస్ ఎగ్జామ్స్ పాస్ కావడానికి ఒక షాట్ అడ్వైజ్ ఇవ్వాలని అడిగాడు ఓ నెటిజన్. దానికి రిప్లై ఇచ్చిన అరుణ్ బోత్రా.. ‘మీ ఫోన్ ను మార్చి నోకియా 5310 వాడండి’ అని ట్వీట్ చేశారు.



స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికీ కమ్యూనికేషన్, కనెక్టివిటీ, సమాచారం పంచుకోవడానికే మార్కెట్ లోకి వచ్చినా.. స్టూడెంట్లను మాత్రం అదే రేంజ్ లో డైవర్ట్ చేస్తుంది. మినీ కంప్యూటర్ల లాంటి మోడరన్ స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక.. పెడదార్లు ఎక్కువైపోతున్నాయి. సోషల్ మీడియా, ఇతరనోటిఫికేషన్ల వైపు ఆసక్తి మరలి ఫోకస్ చేయలేకపోతున్నారు.



ఇలా ఉంటే స్మార్ట్ ఫోన్లను కరెక్ట్ గా వాడుకుని యూపీఎస్సీని ఫాలో అయ్యేవారు ఉన్నారు.ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లతో విలువైన ఇన్ఫర్మేషన్ కూడా పొందగల్గుతున్నారు.