బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫేస్ ‌బుక్ ఖాతాపై నిషేధం

  • Published By: venkaiahnaidu ,Published On : September 3, 2020 / 02:47 PM IST
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫేస్ ‌బుక్ ఖాతాపై నిషేధం

భారత్‌ లో అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శల నేపథ్యంలో ఫేస్‌ బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్య‌క్తిగ‌త ఖాతాపై ఫేస్‌బుక్ నిషేధం విధించింది. ఇకపై ఫేస్ ‌బుక్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎలాంటి పోస్టులు చేయకుండా బ్యాన్ చేసింది. ఫేస్ ‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వ్య‌క్తిగ‌త ఖాతాల‌ను తొల‌గించారు.



ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో రాజాసింగ్… ‌ ఫేస్‌బుక్ నియమాలను పాటించ‌లేద‌ని ఫేస్‌బుక్ యాజ‌మాన్యం తెలిపింది. హింస‌ను ప్రేరేపించే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి త‌మ‌ నియమావళిని ఎమ్మెల్యే ఉల్లంఘించారని.. ఈ క్రమంలోనే ఆయనపై నిషేధం ప్రకటించినట్లు ఫేస్‌బుక్ అధికార ప్ర‌తినిధి తెలిపారు.
https://10tv.in/actress-madhavi-latha-face-to-face-over-drugs-affair/
కాగా, కొద్ది రోజులక్రితం భారత్ లో ఫేస్‌ బుక్‌ కు సంబంధించి వాల్‌స్ట్రీట్ జనరల్ సంచలన కథనాన్ని ప్రచురించించిన విషయం తెలిసిందే. భారత్ లో అధికార బీజేపీ నాయకులు ఫేస్ ‌బుక్‌ లో చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను ఆ సంస్థ చూసీచూడనట్లు వదిలేస్తూ.. చర్యలు తీసుకోవడం లేదంటూ ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత్‌లో తమ వ్యాపార లావాదేవీలు దెబ్బతినకుండా ఉండేందుకే ఫేస్‌బుక్ అలా చేస్తోందని ఆ కథనంలో పేర్కొంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు మరో ముగ్గురు బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలు చర్యలు తీసుకునే స్థాయిలో ఉన్నాయని ఫేస్‌బుక్‌ ఉద్యోగులు గుర్తించినా చర్యలు తీసుకోలేదని ఆ కథనం వెల్లడించింది.



వాల్‌స్ట్రీట్ జనరల్ ఆర్టికల్ తర్వాత… బీజేపీని, ఫేస్‌ బుక్‌ను టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.ఫేస్ ‌బుక్ బీజేపీకి అనుకూలంగా.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేత్రుత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫేస్ ‌బుక్ యాజమాన్యానికి సమన్లు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఫేస్‌బుక్ ఇండియా చీఫ్ అజిత్ మోహన్ బుధవారం కమిటీ ముందు హాజరయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌ వాదనలతో వాడి వేడిగా సాగిన సమావేశంలో.. ఇరు పార్టీలు ఫేస్‌బుక్‌పై పలు ప్రశ్నలు సంధించాయి. విద్వేషపూరిత ప్రసంగాలు, వ్యాఖ్యల పట్ల ఫేస్‌బుక్ ఎన్నిసార్లు చర్యలు తీసుకుందని స్టాండింగ్ కమిటీలోని ఎంపీలు ఫేస్‌బుక్ ప్రతినిధులను ప్రశ్నించారు. తమ దానికి సంబంధించి ప్రత్యేక గణాంకాలేవీ లేవని వారు బదులిచ్చారు. చాలా సందర్భాల్లో ఏదైనా ఫిర్యాదు అందినప్పుడు మాత్రమే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఫేస్‌బుక్ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోందా అన్న కాంగ్రెస్ ప్రశ్నలకు సమాధానం చెప్పనట్లు తెలుస్తోంది.