పార్కుల్లో సీసీ కెమెరాలు.. కుర్చీలు, బెంచీల మధ్య 6అడుగుల దూరం
కరోనా నుంచి అప్రమత్తంగా ఉండటానికి ఎంటర్టైన్మెంట్కు అవకాశమివ్వడానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రీసెంట్ గా గైడ్లెన్స్ రిలీజ్ చేసింది. పార్కుల్లో, ఫుడ్ కోర్టుల్లో గుంపులుగా ఉండకుండా చూడాలని.. సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆర్డర్ చేసింది.
కరోనా కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం ఇంకా వినోదపు పార్కులు తెరవకూడదనే నిబంధన విధించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రీసెంట్గా గైడ్లెన్స్ జారీచేసింది. కరోనా వ్యాప్తి నిరోధించేందుకు వినోదపు పార్కుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది.
మార్గదర్శకాలివే:
* కనీసం 6 అడుగుల ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను వాడాలి. ఉమ్మివేయడం నిషేధం.
* 65 ఏళ్లు పైబడి, తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నా.. గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు ఇంట్లో నుంచి బయటకు రాకూడదు.
* పార్కుల్లో అనారోగ్యంతో ఉన్న సిబ్బంది, వయసు పైబడిన, గర్భిణులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలతో డైరక్ట్ ఇంటరాక్ట్ లేకుండా విధులు నిర్వహించాలి.
* ఫుడ్‌కోర్టులు ఇతర చోట్ల రద్దీని గుర్తించడానికి సీసీటీవీలతో పర్యవేక్షించాలి.
* ప్రాంగణం లోపల, వెలుపల భౌతికదూరాన్ని పాటించేలా నేలపై నిర్ధిష్ట గుర్తులుపెట్టుకోవాలి. ప్రాంగణం లోపల, వెలుపల క్యూ పాటించాలి. క్యూ, భౌతికదూరం పర్యవేక్షణకు తగినంత మంది సిబ్బందిని నియమించాలి.
* ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం కంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీకి అనుమతించకూడదు. ఫుడ్‌కోర్టు సిబ్బంది లేదా వెయిటర్లు మాస్క్‌లు, గ్లోవ్స్ తప్పనిసరిగా ధరించాలి.
* మ్యూజియంలు, ఉద్యానవనాలు, ఫుడ్ కోర్టులు, థియేటర్లలో డోర్ హ్యాండిల్స్, ఎలివేటర్ బటన్స్, కుర్చీలు, బెంచీలు, అంతస్థులు, గోడలు మొదలైనవాటిని సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచాలి.
* వాష్‌రూమ్‌లలో సబ్బు, ఇతర సాధారణ ప్రాంతాల్లో హ్యాండ్ శానిటైజర్లను తగినంత పరిమాణంలో ఉంచాలి. మాస్క్‌లు, శానిటైజర్లు, సబ్బులు, సోడియం హైపోక్లోరైట్ ద్రావణం, ఇతరత్రా లాజిస్టిక్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.
* సందర్శకులు, ఉద్యోగులు ఉపయోగించిన మాస్క్‌లను ప్రత్యేక కవర్ డబ్బాలలో పారవేసేలా ఏర్పాట్లు చేయాలి.
* స్విమ్మింగ్‌పూల్స్‌ను మూసివేయాలి. నీటితో కూడిన వినోదం అందించే పార్కుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటిచోట్ల నీటి వడపోత, క్లోరినేషన్ తప్పనిసరి.
* రద్దీ ఎక్కువ ఉండే వారాంతం, సెలవు రోజుల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
* ఆన్లైన్ టిక్కెట్ ఫెసిలిటీని సపోర్ట్ చేయాలి. టికెట్లు జారీ చేసేటప్పుడు చేయవలసిన, చేయకూడని సూచనలు వాటిపై ఉండేలా చూడాలి.
* క్రాస్ వెంటిలేషన్ తో పాటు సహజ వెలుతురు ఉండాలి.
* కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారు పార్కును సందర్శించకూడదని తెలపాలి. కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారికి ప్రవేశం లేదు.
* కోవిడ్ హెల్ప్‌లైన్ నంబర్లను, స్థానిక ఆరోగ్య అధికారుల ఫోన్ నంబర్లను ప్రదర్శించాలి.
* ఎంట్రన్స్ దగ్గర శానిటైజర్ డిస్పెన్సర్, థర్మల్ స్క్రీనింగ్ తప్పక ఏర్పాటుచేయాలి. ఎగ్జిట్ మార్గాల కోసం వీలైనన్ని గేట్లు ఏర్పాటు చేయాలి.
* వాలెట్ పార్కింగ్ అందుబాటులో ఉంటే మాస్క్‌లు ధరించిన ఆపరేటింగ్ సిబ్బందితో పనిచేయించాలి. వాహనాల స్టీరింగ్, డోర్ హ్యాండిల్స్, కీలు మొదలైన వాటిని శుభ్రపరచాలి.
* పార్క్ ప్రాంగణంలో కుర్చీలు, బెంచీలు మొదలైన వాటి మధ్య 6 అడుగుల దూరం ఉండాలి.
* కాంటాక్ట్‌లెస్ ఆర్డరింగ్ మోడ్, డిజిటల్ మోడ్ చెల్లింపులను ప్రోత్సహించాలి.