Covid-19 వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్‌లు ఏమైనా ఉన్నాయా..?

Covid-19 వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్‌లు ఏమైనా ఉన్నాయా..?

Covid-19 Vaccine: కొవిడ్ కోసం తొలిసారి వ్యాక్సిన్ డెవలప్ చేసింది ఫైజర్. పైగా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అంటూ యూకే రెగ్యూలేటర్స్ చెప్పుకొచ్చారు. సైంటిస్టులు కూడా టెస్టులు చేసి 95శాతం ఎఫెక్టివ్ అని మరే సైడ్ ఎఫెక్ట్ లు లేవని చెప్పారు. ఈ మాట మీద వచ్చేవారానికి యూకేలో 8లక్షల డోసులు చేరబోతున్నాయి.

మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి సంవత్సరం మిలియన్లలో వ్యాక్సినేషన్స్ ఇవ్వాల్సి ఉంది. అలా అని పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ వ్యాక్సిన్‌ను సాధారణ ఫ్రిడ్జ్‌లలోనూ నిల్వ ఉంచుకోవచ్చు. ఎవరేం చెప్పినా సగటు మనిషిలో ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా..



ఈ వ్యాక్సిన్ అన్ని ఏజ్ గ్రూపులపై పనిచేస్తుందని సైంటిస్టులుచెప్పారు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ప్రతి వ్యాక్సిన్ కు సైడ్ ఎఫెక్ట్ లు ఉంటాయి. కాకపోతే దీనికి కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి.

ఎక్కువ వ్యాక్సిన్లు ఎర్రగా మారడం, పుండుగా మారడం వంటివి కనిపిస్తుంటాయి. కానీ, కొవిడ్ వ్యాక్సిన్ ను అన్నింటితో పోలిస్తే కాస్త తక్కువ ఎఫెక్ట్ మాత్రమే కనిపించింది.

కామన్ రియాక్షన్లు:
వ్యాక్సిన్ ట్రయల్స్ లో రెండు డోసులు వేశారు. మొదటిసారి ఏ మాత్రం మార్పులు కనిపించకపోగా రెండో సారి నీరసం, తలనొప్పి వంటివి మాత్రమే కనిపించాయి. ఇందులోనూ కేవలం నాలుగు శాతం మాత్రమే నీరసంగా, రెండు శాతం మాత్రమే తలనొప్పితో బాధపడ్డారు. పైగా అవి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయట. ఇవన్నీ కేవలం కామన్ రియాక్షన్సేనని డా.సారా చెబుతున్నారు.

ప్రతిఒక్కరికీ యూజ్‌ఫుల్‌గా:
వ్యాక్సిన్ మీద నమ్మకం ఉంచేసి చేతులు, ముఖం, సామాజిక దూరాన్ని విస్మరించకూడదని చెబుతూనే ఉంది ప్రభుత్వం. 20వేల మందిపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించిన ఫైజర్‌కు కేవలం 8మందికి మాత్రమే కరోనా పాజిటివ్ రాగా, ఒక్కరు మాత్రమే సీరియస్ గా జబ్బు బారిన పడ్డారు.