JioCinema Premium Plan : జియోసినిమా.. ప్రీమియం వార్షిక ప్లాన్‌ సైలెంట్‌గా వచ్చేసింది.. ఈ ప్లాన్ ధర ఎంతో తెలుసా?

JioCinema Premium Plan : రిలయన్స్ జియో వార్షిక ప్లాన్ ధర అందించే ఇతర సర్వీసులు కన్నా చౌకగా ఉంటుంది. కొత్తగా ప్రవేశపెట్టిన వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధరను 50 శాతం తగ్గించింది.

JioCinema Premium Plan : జియోసినిమా.. ప్రీమియం వార్షిక ప్లాన్‌ సైలెంట్‌గా వచ్చేసింది.. ఈ ప్లాన్ ధర ఎంతో తెలుసా?

JioCinema Premium Annual Plan ( Image Credit : Google )

Updated On : May 26, 2024 / 6:10 PM IST

JioCinema Premium Plan : ప్రముఖ వయాకమ్18 యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. సరిగ్గా నెల తర్వాత జియోసినిమా ప్రీమియం వార్షిక ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ యాడ్స్ లేకుండా 4కె రిజల్యూషన్‌తో స్ట్రీమింగ్ వీడియోలను (క్రీడలు, లైవ్ ఈవెంట్‌లు మినహా) అందిస్తుంది. వార్షిక ప్లాన్ ధర అందించే ఇతర సర్వీసులు కన్నా చౌకగా ఉంటుంది. కొత్తగా ప్రవేశపెట్టిన వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధరను 50 శాతం తగ్గించింది.

Read Also : Jio FanCode Subscription : జియో యూజర్ల కోసం కాంప్లిమెంటరీ ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్.. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు!

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ కొత్త ప్లాన్ గురించి ముందుగానే ధృవీకరించింది. జియోసినిమా వెబ్‌సైట్ ఇప్పుడు ప్రీమియం వార్షిక ప్లాన్‌ను అందిస్తుంది. దీని ధర రూ. 599గా ఉంది. పరిచయ ఆఫర్‌లో భాగంగా, కస్టమర్‌లు 50 శాతం తగ్గింపును పొందవచ్చు. సబ్‌స్క్రిప్షన్ ధరను రూ. 299కు అందిస్తోంది. మొదటి 12 నెలల బిల్లింగ్ సైకిల్ ముగిసిన తర్వాత ప్లాట్‌ఫారమ్ యూజర్ల నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేస్తుంది.

కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. జియోసినిమా ప్రీమియం వార్షిక ప్లాన్ నెలవారీ ప్లాన్ మాదిరిగా అదే బెనిఫిట్స్ అందిస్తుంది. ప్రీమియం కంటెంట్ హెచ్‌బీఓ పారామౌంట్, పీకాక్, వార్నర్ బ్రదర్స్‌తో సహా వీడియోల యాడ్స్ ఫ్రీ స్ట్రీమింగ్ 4కె రిజల్యూషన్‌లో ఒక డివైజ్‌లో ఆఫ్‌లైన్ వ్యూకు యూజర్లు డివైజ్‌లో కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మూడు స్ట్రీమింగ్ ప్లాన్‌లు యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్‌ను అందిస్తాయి.

అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నమెంట్, ఇతర స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్‌లు యాడ్స్ సహా కొనసాగుతాయి. ప్రస్తుత ధర ప్రకారం.. రూ.299, ప్రీమియం మంత్లీ ప్లాన్ కన్నా ప్రీమియం వార్షిక ప్లాన్ డబ్బుకు మెరుగైన వాల్యూను అందిస్తుంది. రెండోది రూ. 59కు పొందవచ్చు. కొత్త ప్రీమియం వార్షిక ప్లాన్ పాత వార్షిక సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కన్నా చాలా చౌకగా ఉంటుంది. గత నెలలో రూ. 999 ప్లాన్ నిలిపివేసింది.

గత నెలలో జియోసినిమా ప్రీమియం ఫ్యామిలీ సబ్‌స్క్రిప్షన్‌ రూ. 149 ఉండగా, సబ్‌స్క్రిప్షన్ ధరను ఫస్ట్ నెలకు రూ.89కి తగ్గించింది. జియోసినిమా నెలవారీ సభ్యత్వం ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో కన్నా చౌకగానే అందిస్తోంది. మొబైల్-ఓన్లీ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ప్రారంభ ధర నెలకు రూ. 149, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో రెండూ కస్టమర్‌లకు నెలవారీ సభ్యత్వ రుసుము రూ. 299 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రెండు స్ట్రీమింగ్ సర్వీసుల వార్షిక ధర రూ. 1,499కు పొందవచ్చు.

Read Also : Reliance Jio Offers : రిలయన్స్ జియో అదిరే ఆఫర్.. ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లు ఈ ఓటీటీ కంటెంట్ ఫ్రీగా పొందొచ్చు..!