Jio FanCode Subscription : జియో యూజర్ల కోసం కాంప్లిమెంటరీ ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్.. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు!

Jio FanCode Subscription : జియో ఎయిర్‌ఫైబర్, జియోఫైబర్, జియో మొబిలిటీ ప్రీపెయిడ్ యూజర్లు ఇప్పుడు ప్రీమియం స్పోర్ట్స్ ఓటీటీ యాప్ అయిన ఫ్యాన్‌కోడ్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

Jio FanCode Subscription : జియో యూజర్ల కోసం కాంప్లిమెంటరీ ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్.. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు!

Jio FanCode Subscription ( Image Credit : Google )

Jio FanCode Subscription : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఎంపిక చేసిన జియో ఎయిర్‌ఫైబర్, జియోఫైబర్, జియో మొబిలిటీ ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసం కాంప్లిమెంటరీ ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా క్రీడా ఔత్సాహికుల కోసం జియో సరికొత్త, థ్రిల్లింగ్ డిజిటల్ అనుభవాన్ని తీసుకొచ్చింది.

జియో ఎయిర్‌ఫైబర్, జియోఫైబర్, జియో మొబిలిటీ ప్రీపెయిడ్ యూజర్లు ఇప్పుడు ప్రీమియం స్పోర్ట్స్ ఓటీటీ యాప్ అయిన ఫ్యాన్‌కోడ్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ ఫ్యాన్‌కోడ్ ప్రత్యేకమైన ఫార్ములా 1 (F1) స్ట్రీమింగ్ కంటెంట్‌కి యాక్సెస్‌తో సహా జియో యూజర్లకు అత్యుత్తమ స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Read Also : Realme P1 Pro 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెల 21న రియల్‌మి P1 ప్రో 5జీ ఫోన్‌పై స్పెషల్ డిస్కౌంట్.. ధర ఎంతంటే?

జియో ఎయిర్‌ఫైబర్ అండ్ జియోఫైబర్ కస్టమర్‌లకు రూ.1199 అంతకంటే ఎక్కువ ప్లాన్‌లకు సబ్‌స్క్రిప్షన్ వారికి కాంప్లిమెంటరీ ఫ్యాన్‌కోడ్ యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే, జియో మొబిలిటీ ప్రీపెయిడ్ యూజర్లు ఇప్పటికే ఉన్న రూ.398, రూ.1198, రూ.4498 ప్లాన్‌లతో పాటు సరికొత్త రూ.3333 వార్షిక ప్లాన్‌పై కూడా యాక్సెస్ పొందవచ్చు. ఈ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు. ప్రస్తుత, కొత్త యూజర్లకు అర్హత ఉన్న ప్లాన్‌లకు అందుబాటులో ఉంటుంది.

ఈ ఫ్యాన్‌కోడ్ అనేది ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్‌లు, మహిళల క్రికెట్, లైవ్ ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బేస్ బాల్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, ఇతర ప్రధాన క్రీడా ఈవెంట్‌లతో సహా అనేక రకాల క్రీడల ఇంటరాక్టివ్ లైవ్ స్ట్రీమింగ్‌ను అందించే ప్రముఖ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అని చెప్పవచ్చు. 2024 నుంచి 2025కి భారతీయ ప్రత్యేకమైన ఎఫ్1 ప్రసార హక్కులను కలిగి ఉంది. ఫార్ములా 1 ఔత్సాహికులలో బాగా పాపులర్ పొందింది. జియో యూజర్లు రియల్ టైమ్ మ్యాచ్ హైలైట్‌లు, మ్యాచ్ వీడియోలు, ఇండియన్ క్రికెట్ హెడ్‌లైన్స్ డేటా, గణాంకాలను పొందవచ్చు.

ప్రీమియం ఫ్యాన్‌కోడ్ కంటెంట్ కీలక ఫీచర్లు :

  • జియో యూజర్లు JioTV+ లేదా JioTV యాప్ ద్వారా ఫ్యాన్‌కోడ్ ప్రత్యేకమైన స్పోర్ట్స్ కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు.
  • ఎఫ్1 యాక్సెస్ : ఫ్యాన్ కోడ్ 2024, 2025 సీజన్లలో భారత్ ఫార్ములా 1 కోసం ప్రత్యేక ప్రసార హక్కులను కలిగి ఉంది.
  • భారతీయ అభిమానులు స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లలో ఫ్యాన్‌కోడ్‌లో రేసులను చూడవచ్చు.
  • కవరేజ్‌లో ప్రాక్టీస్, క్వాలిఫైయింగ్ సెషన్‌లు, స్ప్రింట్ రేసులు, గ్రాండ్స్ ప్రిక్స్
  • వైడ్ కవరేజ్ : ప్రధాన క్రీడా ఈవెంట్‌లు, రియల్ టైమ్ అప్‌డేట్స్ లైవ్ స్ట్రీమింగ్ పొందవచ్చు.
  • క్రీడా లైబ్రరీ : మ్యాచ్ హైలైట్‌లు, వివరణాత్మక గణాంకాలు, ఫాంటసీ స్పోర్ట్స్ ఇన్‌సైట్స్ యాక్సెస్ చేయొచ్చు.
  • బ్రేకింగ్ న్యూస్: భారత క్రికెట్, గ్లోబల్ స్పోర్ట్స్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ వార్తలతో అప్‌డేట్ అవ్వండి.

కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ :
జియో కొత్త రూ. 3333 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. జియో ఎయిర్‌ఫైబర్, జియోఫైబర్, ప్రీపెయిడ్ మొబిలిటీ ప్లాన్ యూజర్లు అర్హత గల ప్లాన్‌లను పొందవచ్చు. మునుపెన్నడూ లేని విధంగా క్రీడల ప్రపంచంలో ప్రత్యేకంగా ఎఫ్1 కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఆఫర్ జియో యూజర్లు వినోదం, వార్తలు ఆధ్యాత్మికం మొదలైన ఇతర కేటగిరీలో కంటెంట్ లైబ్రరీతో పాటు హై క్వాలిటీ గల స్పోర్ట్స్ కంటెంట్‌కు యాక్సెస్‌ను పొందవచ్చు.

Read Also : Viral Video : యూట్యూబర్ సరికొత్త ప్రయోగం.. కేవలం రూ. 12.5 లక్షలకే హోండా సివిక్‌ను లగ్జరీ కారు ‘లంబోర్ఘిని’గా మార్చేశాడు..!