బనగానపల్లెలో దారుణం : 6వ తరగతి విద్యార్థిని కర్రతో తీవ్రంగా కొట్టిన కరస్పాండెంట్
Correspondent beat student : కర్నూలు జిల్లా బనగానపల్లెలో దారుణం జరిగింది. నెహ్రూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అమానుషం చోటు చేసుకుంది. మానవత్వం లేకుండా విద్యార్థిని నిర్బంధించి చితకబాదాడో కరస్పాండెంట్. ఆ దెబ్బల దాటికి విద్యార్థి స్పృహ తప్పి పడిపోయాడు.
పట్టణంలోని నెహ్రూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ ఘటన చోటు చేసుకుంది. 6వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని స్కూల్ కరస్పాండెంట్ రవితేజ కర్రతో తీవ్రంగా కొట్టాడు. గాయపడిన ఆ విద్యార్థికి బనగానపల్లె ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కరస్పాండెంట్ చర్యపై బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.