చొరబడిన ఉగ్రవాదులు : తమిళనాడులో హై అలర్ట్

  • Published By: madhu ,Published On : August 23, 2019 / 05:07 AM IST
చొరబడిన ఉగ్రవాదులు : తమిళనాడులో హై అలర్ట్

తమిళనాడు రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. లష్కరే ఎ తోయిబా ఉగ్రవాదులు ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. శ్రీలంక మీదుగా తమిళనాడులోకి ఆరుగురు ఉగ్రవాదులు చొరబడ్డారని తెలిపింది. ఇందులో ఒక పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి, ఐదుగురు శ్రీలంక తమిళులున్నట్లు వెల్లడించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. చెన్నైతో సహా కోయంబత్తూరు ప్రధాన పట్టణాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. నిఘా వర్గాల సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు చెన్నై సీపీ వెల్లడించారు. పెట్రోలింగ్ దళాలను పెంచింది. కశ్మీర్‌లో అప్ఘన్ ఉగ్రవాదులను మోహరించే ప్రయత్నం పాక్ చేస్తోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 

కోయంబత్తూర్‌లో 1500 మంది ప్రత్యేక సిబ్బంది మోహరించారు. వాహనాలను క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వెస్ట్ జోన్ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో మొత్తం 7 వేల మంది పోలీసులను మోహరించినట్లు వెస్ట్ జోన్ ఐజీ తెలిపారు. అనుమానితులుగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌తో సహా దేశంలోని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ఛాన్స్ ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.