Visakhapatnam: విశాఖ అభివృద్ధికి రూ.3000 కోట్లు – విజయసాయి రెడ్డి

విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లోని పార్కులు, ఓపెన్ స్థలాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వార్డుల్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు విజయసాయి రెడ్డి. డిసెంబర్ నాటికి అమృత పథకం కింద ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తామని తెలిపారు. విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

Visakhapatnam: విశాఖ అభివృద్ధికి రూ.3000 కోట్లు – విజయసాయి రెడ్డి

Visakhapatnam

Visakhapatnam: విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గురువారం జీవీఎంసీ కార్యాలయంలో మంత్రి కన్నబాబు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశానికి, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.

విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లోని పార్కులు, ఓపెన్ స్థలాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వార్డుల్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు విజయసాయి రెడ్డి. డిసెంబర్ నాటికి అమృత పథకం కింద ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తామని తెలిపారు. విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ముడసరలోవ అభివృద్ధికి సీఎం జగన్ రూ.100 కోట్లు ఇస్తానని వాగ్దానం చేశారని గుర్తు చేశారు ఎంపీ. ఇక విశాఖ అభివృద్ధికి మూడు వేలకోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. పరిపాలన రాజధాని అభివృద్ధి విషయంలో ప్రణాళిక బద్దంగా ముందుకు వెళతామని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. త్వరలోనే విశాఖలో అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.