PAN-Aadhaar link : ట్యాక్స్ పేయర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు
ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానించాలని కేంద్రం ఎప్పటి నుంచో కోరుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరోసారి గడుపు పెంపు నిర్ణయం తీసుకుంది.
PAN-Aadhaar link : ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానించాలని కేంద్రం ఎప్పటి నుంచో కోరుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరోసారి గడుపు పెంపు నిర్ణయం తీసుకుంది. గతంలో జూన్ 30 వరకు గడువు విధించగా, అది మరి కొన్నిరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో, పాన్ కార్డు-ఆధార్ లింక్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటన చేసింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో ఆధార్- పాన్ కార్డు లింక్ ఎంతో కీలకం. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరో మూడు నెలలు వెసులుబాటు లభించినట్టైంది. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు సెప్టెంబర్ 30 తర్వాత చెల్లుబాటు కావని కేంద్రం స్పష్టం చేసింది.
* పాన్, ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ ఇనాపరేటివ్‌గా మారుతుంది. అంటే పాన్ కార్డ్ చెల్లదు.
* ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డును ఎక్కడా ఉపయోగించకూడదు.
* పాన్ కార్డు లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం సాధ్యం కాదు.
* మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం వీలు కాదు.
* స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ కావాలి. కానీ ఆధార్ లింక్ చేయని పాన్ కార్డుతో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయలేరు.
* ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి.
* రూ.50వేల కన్నా ఎక్కువ లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డు కావాల్సిందే.
పాన్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి 4 పద్ధతులు ఉన్నాయి. ఎస్ఎంఎస్ ద్వారా, ఆన్లైన్లో వెంటనే పాన్ ఆధార్ లింక్ చేయొచ్చు. ఇవి కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేప్పుడు, పాన్ కార్డ్ దరఖాస్తులో కూడా పాన్, ఆధార్ నెంబర్ లింక్ చేసే అవకాశం ఉంది.
SMS: ఎస్ఎంఎస్ ద్వారా పాన్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ సూచించిన ఫార్మాట్లో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి 10 డిజిట్ పాన్ నెంబర్ ఎంటర్ చేసి 567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ పంపాలి.
Online: ఆన్లైన్లో పాన్, ఆధార్ లింక్ చేయడానికి https://www.incometax.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Link Aadhaar ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. Link Aadhaar పైన క్లిక్ చేస్తే పాన్, ఆధార్ నెంబర్లు లింక్ అవుతాయి.
Income Tax Returns: మీరు ప్రతీ ఏటా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? అయితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ వెల్లడిస్తే సరిపోతుంది.
PAN Card Application: కొత్తగా పాన్ కార్డ్ తీసుకుంటున్నారా? ఇప్పటికే ఉన్న పాన్ కార్డులో ఏవైనా మార్పులు చేస్తున్నారా? అప్లికేషన్ ఫామ్‌లో ఆధార్ నెంబర్ వెల్లడిస్తే మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అవుతాయి.