తీహార్ జైల్లో ఖైదీల మధ్య చిదంబరం పుట్టినరోజు

  • Published By: madhu ,Published On : September 6, 2019 / 08:51 AM IST
తీహార్ జైల్లో ఖైదీల మధ్య చిదంబరం పుట్టినరోజు

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పుట్టిన రోజు వేడుకలను ఆయన జైల్లో చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన తన 74వ బర్త్ డే (సెప్టెంబర్ 16)న తీహార్ జైల్లో ఖైదీల మధ్య జరుపుకోవాల్సి వచ్చింది. ఆయనకు నార్త్ బ్లాక్ 7వ నెంబర్ గది కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో 600 నుంచి 700 మంది ఖైదీలు ఉంటారని అంచనా.

INX మీడియా కేసులో సెప్టెంబర్ 05వ తేదీ గురువారం చిదంబరంకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు పోలీసులు. సెప్టెంబర్ 19 వరకు అక్కడే ఉండనున్నారు. కోర్టు కొన్ని కండీషన్స్ కూడా పెట్టింది. మందులు మినహా ఏవీ తీసుకెళ్లరాదని ఆదేశించింది. ఓ బారక్‌ను కేటాయించారు. వాస్తవానికి ఈ బారక్‌లో 10 మందిని ఉంచుతారు. ఆయన వయస్సును దృష్టిలో ఉంచుకున్న కోర్టు..రాత్రి వేళ బీపీ చెక్ చేసుకోవడానికి ఓ వైద్యుడిని ఏర్పాటు చేయాలని సూచించింది. 

జైలుకు వెళ్లేముందు చిదంబరం మీడియాతో మాట్లాడారు. మోడీ సర్కార్‌పై సెటైర్లు వేశారు. కేవలం దేశ ఆర్థిక వ్యవస్థ గురించే బాధ పడుతున్నట్లు చెప్పారు. 2007లో INX మీడియా సంస్థలో విదేశీ నిధులను భారీగా తరలించారనే అభియోగాలు ఎదుర్కొన్నారు చిదంబరం. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం పేరును కూడా సీబీఐ ఛార్జీషీట్‌లో నమోదు చేశారు.