చంద్రయాన్ 2 : విక్రమ్ ల్యాండర్ ఇలా దిగనుంది.. ఈ వీడియో చూడండి

  • Published By: madhu ,Published On : September 6, 2019 / 11:20 AM IST
చంద్రయాన్ 2 : విక్రమ్ ల్యాండర్ ఇలా దిగనుంది.. ఈ వీడియో చూడండి

యావత్ భారతదేశమే కాదు.. ప్రపంచ దేశాలన్నీ విక్రమ్ ల్యాండర్ వైపు చూస్తోంది. చంద్రుడిపై కాలు మోపడానికి కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ అద్బుత ఘట్టాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగే అద్భుత ఘట్టాన్ని చూడటానికి ప్రధాని మోడీతోపాటు ప్రపంచంలోని శాస్త్రవేత్తలు అందరూ సిద్ధమయ్యిపోయారు. విక్రమ్ ల్యాండింగ్ ఎలా ఉండబోతోంది ? ఎలా దిగుతుంది ? దిగిన తర్వాత ఎలా పని చేస్తుంది అనే లైవ్ లో చూడటానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు ఓ యానిమేటెడ్ వీడియోను రూపొందించారు. ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌ అయ్యింది. 

మీట్ విక్రమ్..చంద్రయాన్ 2 ల్యాండర్ అనే వీడియోలో ప్రతిభాగం ఎలా పనిచేస్తుందనేది స్పష్టంగా తెలిపారు. 3 నిమిషాల 44 సెకన్ల పాటు ఈ వీడియో ఉంది. దీనికి విక్రమ్ ద ల్యాండర్ అని పేరు పెట్టారు. విక్రమ్ ల్యాండర్ ఎలా దిగనుంది.. అందులో ఉన్న భాగాల పేర్లను వివరించారు. ఒక్కో భాగం పేరు..దాని పనితీరును పొందపరిచారు. విక్రమ్ ల్యాండర్ తిరిగే విధానంతోపాటు ఇతర విషయాలు వివరించారు.

Read More : చంద్రయాన్ 2 : మూన్ ల్యాండింగ్ లో ఆ 15 నిమిషాలే కీలకం
సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి 2.30 గంటల మధ్య చందమామపై అడుగుపెట్టబోతోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకుని వీక్షించనున్నారు. అధికారులు ఏర్పాట్లు చేశారు. చంద్రుడి రహస్యాలు తెలుసుకునేందుకు చేపట్టిన రెండో ప్రయోగం ఇది. ఈ ప్రక్రియలో ప్రతి సెకనూ కీలకం. సమయం దగ్గర పడుతున్న కొద్ది ఇస్త్రో శాస్త్రవేత్తల్లో టెన్షన్ పెరిగిపోతోంది.