Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధర

బంగారం ధరలో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.120 పెరిగింది. శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,700లుగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,680లుగా ఉంది. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం రేట్లు పెరుగుతున్నాయి. వరుసగా మూడు రోజులు పెరిగితే బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చని బులియన్ నిపుణులు చెబుతున్నారు.

Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధర

Gold Price Today

Gold Price Today : బంగారం ధరలో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.120 పెరిగింది. శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,700లుగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,680లుగా ఉంది. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం రేట్లు పెరుగుతున్నాయి. వరుసగా మూడు రోజులు పెరిగితే బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చని బులియన్ నిపుణులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. శనివారం ఔన్స్ బంగారం $1,778 గా ఉంది. క్రితం నెలతో పోల్చుకుంటే ఔన్స్ ధర చాలా తగ్గింది.

దేశంలోని వివిధ నగరాల్లోని బంగారం ధరలను చూసుకుంటే..

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,020గా ఉంది.
ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,700గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ47,680గా ఉంది.
ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 43,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,680 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,700గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ47,680గా ఉంది.

ఇక వెండి విషయానికి వస్తే.. వెండి ధరల్లో భారీగా మార్పు చోటుచేసుకుంటున్నాయి.. వేళల్లో రేటు తగ్గుతుంది.. అదే విధంగా పెరుగుతుంది. జూన్, జులై నెలల్లో రూ.70 వేలు ఉన్న కిలో వెండి ఇప్పుడు రూ.67500 కి చేరింది. ఇక శుక్రవారంతో పోల్చితే శనివారం కిలో వెండిపై రూ.20 తగ్గింది. ముంబై కలకత్తాలో వెండిధర చాలా తక్కువగా ఉంది. ఈ రెండు పట్టణాల్లో రూ.62,500 లకే కేజీ వెండి లభిస్తుంది. ఇక హైదరాబాద్ లో మాత్రం వెండి ధర రూ.67,300గా ఉంది.