‘మహీ భాయ్ అవుట్ అవడం చూసి కన్నీళ్లు ఆగలేదు’

‘మహీ భాయ్ అవుట్ అవడం చూసి కన్నీళ్లు ఆగలేదు’

వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో పోరాడి ఓడింది భారత్. ఆ సమయంలో చివరి వరకూ ధోనీపైనే ఆశలు నిలుపుకున్నారు. భారత్‌తో పాటు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు కూడా టీమిండియా గెలవాలనే కోరుకున్నారు. కానీ, ధోనీ రనౌట్ మ్యాచ్ గతిని మార్చేసింది. ఫలితంగా భారత్ 18పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ సమయంలో చాహల్ కన్నీళ్లు ఆగలేదంట. వరల్డ్ కప్ ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయని అప్పటి క్షణాలు గుర్తు చేసుకున్నాడు. 

రవీంద్రజడేజాతో కలిసి 116పరుగులు జోడించేంత వరకూ క్రీజులోనే ఉన్నాడు ధోనీ. ‘ఇది నా తొలి వరల్డ్ కప్. మహీ భాయ్ అవుట్ అవడంతో నేను బ్యాటింగ్‌కు వచ్చాను. వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ బ్యాటింగ్ చేశాను. అది చాలా డిప్రెషన్‌కు గురి చేసింది’ అని చాహల్ ఇంగ్లీషు మీడియా ముందు వెల్లడించాడు. 

‘తొమ్మిది గేమ్ లు బాగానే ఆడాం. అకస్మాత్తుగా టోర్నమెంట్ నుంచి వెనక్కి రావాల్సి వచ్చింది. వర్షం మన చేతుల్లో లేదు కదా. దాని గురించి హక్కు మనకు లేదు. మైదానం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హోటల్ కు వెళ్లిపోవాలి అనుకోవడం మాకు ఇదే తొలిసారి. ఒక్కసారైనా వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో భాగం కావాలి. ఇంకో అయిదారేళ్లు ఆడతానని అనుకుంటున్నా’ అంటూ చాహల్ ముగించాడు.