IPL 2024 : ఢిల్లీకి షాక్.. సొంతగడ్డపై 7 వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం

IPL 2024 - DC vs KKR : ఢిల్లీ నిర్దేశించిన 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించి 157 పరుగులతో కోల్‌కతా గెలిచింది. ఢిల్లీ పతనాన్ని శాసించిన వరుణ్ చక్రవర్తి (3/16)కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్దు దక్కింది.

IPL 2024 : ఢిల్లీకి షాక్.. సొంతగడ్డపై 7 వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం

IPL 2024 _ KKR Vs DC ( Image Source : Credit @IPL/Twitter/Google)

IPL 2024 : ఐపీఎల్ 2024లో కోల్‌కతా ఢిల్లీకి షాకిచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా 21 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫిలిప్ సాల్ట్ (68; 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్) హాఫ్ సెంచరీతో విజృంభించగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33), వెంకటేష్ అయ్యర్ (26), సునీల్ నరైన్ (15), రింకు సింగ్ (11) పరుగులతో రాణించారు.

ఢిల్లీ నిర్దేశించిన 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులతో కోల్‌కతా గెలిచింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టగా, లజద్ విలియమ్స్ ఒక వికెట్ తీసుకున్నాడు.

కుల్దీప్ యాదవ్ టాప్ స్కోరు :
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లలో కుల్దీప్ యాదవ్ (35) అజేయంగా టాప్ స్కోరరుగా నిలవగా, కెప్టెన్ రిషబ్ పంత్ (27), అభిషేక్ పోరెల్ (18), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (12), పృథ్వీ షా (13) పరుగులకే పరిమితం అయ్యారు.

ఇక మిగిలిన ఆటగాళ్లలో షాయ్ హోప్ (6), ట్రిస్టన్ స్టబ్స్ (4), రాసిఖ్ సలామ్ (8), లిజాడ్ విలియమ్స్ (1 నాటౌట్), కుమార్ కుశాగ్రా (1) సింగిల్ డిజిట్ కే చేతులేత్తేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు కోల్‌కతాకు 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఏకంగా 3 వికెట్లు తీయగా, వైభవ్ అరోరా, హర్షిత్ రానా తలో రెండు వికెట్లు, మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్ తలో వికెట్ తీసుకున్నారు. ఢిల్లీ పతనాన్ని శాసించిన వరుణ్ చక్రవర్తి (3/16)కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్దు దక్కింది.

టాప్ 2లో కోల్‌కతా :
పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 3 ఓడి 12 పాయింట్లతో టాప్ 2లో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 6 ఓడి 10 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది.

Read Also : Virat Kohli : 500 ప‌రుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లి.. డేవిడ్ వార్న‌ర్ రికార్డు స‌మం